నేడు బంగారం, వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు ధరలు మరింత పెరగనున్నాయా... ?

By asianet news teluguFirst Published Nov 25, 2022, 10:37 AM IST
Highlights

ఒక నివేదిక ప్రకారం, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నేడు రూ. 300 పెరిగిన తర్వాత రూ.48,550 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా అండ్ హైదరాబాద్‌లలో పది గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 52,970, 22 క్యారెట్ల ధర రూ. 48,550 వద్ద ఉంది.
 

పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారం, వెండి ధరలు మళ్ళీ ఎగిశాయి. నేడు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర పది గ్రాముల 24 క్యారెట్లకు రూ. 330 పెరిగి రూ. 52,970 వద్ద చేరింది. వెండి ధరలు నిన్నటి ధరతో పోలిస్తే రూ. 1,200 పెరిగి  రూ.62,200 వద్ద ఉంది.

 ఒక నివేదిక ప్రకారం, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నేడు రూ. 300 పెరిగిన తర్వాత రూ.48,550 వద్ద ట్రేడవుతోంది ముంబై, కోల్‌కతా అండ్ హైదరాబాద్‌లలో పది గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 52,970, 22 క్యారెట్ల ధర రూ. 48,550 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,120, 22 క్యారెట్ల ధర రూ. 48,700 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,780, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర 62,200 రూపాయలు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో రూ.68,200గా ట్రేడవుతోంది. స్పాట్ వెండి 0.3 శాతం తగ్గి 21.45 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 0.1% తగ్గి $986.78కి చేరుకుంది, అయితే పల్లాడియం కొద్దిగా మార్పుతో $1,881.97కి చేరుకుంది.

పాకిస్థాన్‌లో శుక్రవారం 10 గ్రాముల 24k బంగారం ధర రూ.136,410గా నమోదైంది. అలాగే, 10 గ్రాముల 22kబంగారం ధర రూ.124,921గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ఇతర కారణాల వల్ల బంగారం ధరలో హెచ్చుతగ్గులకు చాలా అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875 మరియు 18 క్యారెట్లపై 750. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా విక్రయిస్తారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

22 అండ్ 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారాన్ని 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం మృదువైనది అయితే దానితో ఆభరణాలు తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి చాలా మంది దుకాణదారులు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తారు.

click me!