
బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతున్నాయి. గత 24 గంటల్లో బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి క్రమంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. మధ్యలో స్వల్పంగా తగ్గినా..స్థూలంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటివి బంగారం ధర పెరగడానికి కారణమౌతుంటాయి. దాదాపు నెలరోజులుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బంగారం ధర భారీగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 100గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,750 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,100 రూపాయలుగా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,750 రూపాయలుగా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,100వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 48,280 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,670గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,750 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,100గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 47,750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,100గా ఉంది.
ఇకపోతే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,750 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,100గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,100గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
ఇక బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశీయంగా కిలో బంగారంపై రూ. 600లకుపైగా పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, ముంబైలో రూ.68,300గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా, కోల్‌కతాలో రూ.68,300గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, కేరళలో రూ.72,600 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.72,600గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.