
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో బంగారం ధర గత కొద్దిరోజులుగా పరుగులు పెడుతూనే ఉంది. బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఆదివారం (మార్చి 20, 2022) బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 150 రూపాయల నుంచి 170 రూపాయలవరకూ తగ్గింది. కాగా.. వెండి ధరలు కూడా రూ.1,000 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.68,000 గా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 కాగా, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,420 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రాలైన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,000గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,300గా ఉంది. బెంగళూరులో రూ.72,300 ఉండగా.. కేరళలో రూ.72,300గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, విజయవాడలో రూ.72,300 కాగా.. విశాఖపట్నంలో రూ.72,300గా కొనసాగుతోంది.