
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొద్ది రోజలుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు నేడు (ఫిబ్రవరి 18, 2022) ఉదయం తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం బంగారం ధరలు ఏకంగా రూ. 51 వేలు దాటిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 49,970కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 45,800 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,100కు చేరుకోగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.51,380కు చేరింది. ఇక బెంగుళూరు, కోల్‌కతా, కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,970కు చేరింది.
ఇకపోతే.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 49,970కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970కు చేరింది.
వెండి ధరలు
ఓవైపు బంగారం ధరలు భారీగా తగ్గితే.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం (ఫిబ్రవరి 18, 2022) ఉదయం దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగి.. కేజీ వెండి రూ. 63,800కు చేరింది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 638కు చేరింది. నిన్నటితో పోలిస్తే నేడు వెండి ధర రూ. 400 పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 63,800కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,800కు చేరింది. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 63,800కు చేరింది. అలాగే చెన్నై, బెంగుళూరులో కిలో వెండి రూ. 68,500 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలైన.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 68,500 దగ్గర కొనసాగుతుంది. హైదరాబాద్ లో పది గ్రాముల వెండి ధర రూ. 685 వద్ద కొనసాగుతుంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేట్ రూ. 68,500 వద్ద ఉండగా.. పది గ్రాముల వెండి ధర రూ. 685గా ఉంది.