
బంగారం ధర మరోసారి పరుగులు పెడుతుంది. నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు (ఫిబ్రవరి 9, 2022) కూడా అదే దారిలో నడిచింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. బంగారం, వెండి ధరల పెరుగుదల లేదా తగ్గుదలపై చాలా రకాల కారణాలు ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి వంటి వ్యాధుల సంక్రమణ ఇలా చాలా అంశాలు ఉంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పు కన్పిస్తుంటుంది. వివిధ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,530లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,740 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,530 ఉంది. మరోవైపు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,900లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,900లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,100లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 61,900లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.65,100లుగా కొనసాగుతోంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,100లుగా కొనసాగుతోంది. మరోవైపు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.