
ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో బంగారం ధరలు రూ.10 పడిపోయి స్వల్పంగా క్షీణించాయి, దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఆదివారం రూ.55,800తో పోలిస్తే నేడు రూ.55,790గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం కూడా స్వల్పంగా తగ్గింది. 10 గ్రాము 24k బంగారం ధర 10 గ్రాములకి రూ.59,780. కాగా, సోమవారం వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఒక కిలో వెండి ధర రూ.76,600గా ఉందని తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం బంగారం ఔన్స్ ధర $1999.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ వెండి ధర ఔన్సుకు $24.91 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.888 మార్క్ వద్ద కొనసాగుతోంది.
నగరం 22K వెండి
ఢిల్లీ రూ.55,940 రూ.76,600
ముంబై రూ.55,790 రూ.76,600
కోల్‌కతా రూ.55,790 రూ.76,600
చెన్నై రూ.56,390 రూ.80,200
బెంగుళూరు రూ.55,840 రూ.80,200
హైదరాబాద్, బెంగళూరు, కేరళ ఇంకా విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 55,790, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పతనంతో రూ. 60,860.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 పతనంతో రూ. 55,790, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పడిపోయి రూ. 60,860. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,790, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,860. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,790, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,860. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 80,200.
భారతదేశంలో, బంగారం ధరలు ప్రపంచ డిమాండ్, కరెన్సీ, వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలతో సహా అనేక కారకాలపై ఆధారపడి ఉంటాయి.