Gold Silver Price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన పసిడి ధర, తులం బంగారం ఎంతంటే..?

By Krishna AdithyaFirst Published Aug 13, 2022, 10:25 AM IST
Highlights

చాలా కాలంగా మార్కెట్‌లో ధర పెరిగినప్పటికీ బంగారం డిమాండ్ బాగా పెరుగుతోంది. బులియన్ మార్కెట్ విషయానికి వస్తే శుక్రవారం బంగారం ధరలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. శ్రావణ మాసంలో బంగారానికి డిమాండ్ అధికంగా ఉంది.

పెళ్లిళ్లు, పండగల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగారం ఇప్పటికీ దాని రికార్డు రేటు కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అదే సమయంలో మార్కెట్‌లో ధరలు ఎలా పెరుగుతున్నాయో ఇక్కడ చూద్దాం.

బులియన్ మార్కెట్‌లో బంగారం ధర అలాగే ఉంది

బులియన్ మార్కెట్ లో శుక్రవారం కూడా 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి  రూ.52,090కి చేరింది. గురువారం మార్కెట్ ప్రారంభంతో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.51,650కి చేరింది.

శుక్రవారం పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,750 రూపాయలకు చేరుకుంది. ఇంతకు ముందు మార్కెట్ ప్రారంభంతో, పది గ్రాముల ధర రూ.400 పెరిగింది. గురువారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.600 తగ్గింది.

2020 సంవత్సరం ఆగస్టు నెలలో, బంగారం ధర దాని ఆల్ టైమ్ హై ధరకు చేరుకుంది. ఆగస్టు, 2020లో బంగారం ధర పది గ్రాములకు రూ. 55,400 పలికింది. ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.52,090కి చేరుకుంది. ఈ రోజు ధరను దాని ఆల్ టైమ్ హై రేటుతో పోల్చి చూస్తే, బంగారం పది గ్రాములకు రూ.3500 తగ్గింది.

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం (10GM)
22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర - రూ. 47,750
24 క్యారెట్ల బంగారం ధర - రూ. 52,090

హైదరాబాద్ లో వంద గ్రాముల బంగారం (100GM)
22 క్యారెట్ ఆభరణాల బంగారం ధర - రూ. 4,77,500
24 క్యారెట్ల బంగారం ధర - రూ. 5,20,900

హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో నేటి బంగారం ధర

ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ. 47,750 అయితే చెన్నై, ముంబై, కోల్‌కతాలో దీని ధర రూ. 48,900, రూ. 47,750, రూ. 47,750 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు బంగారం ధర రూ.47,900. ఉంది 

నేటి వెండి ధర
అలాగే దేశంలో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి ధర తగ్గింది. భారతదేశంలో వెండి ధరలు డాలర్‌తో రూపాయి పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ఇది దేశీయ బంగారం-వెండి ధరలను ప్రభావితం చేస్తుంది. రూపాయి మారుతున్న కొద్దీ బంగారం, వెండి ధరలు కూడా మారుతున్నాయి.

దేశంలో ఈరోజు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు, హైదరాబాద్ లో 1కిలో వెండి ధర రూ. 64,400 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 64,400, ముంబైలో రూ. 58,500 మరియు కోల్‌కతాలో రూ. 58,500 ఉన్నాయి. అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీలో నేటి వెండి ధర రూ. 58,500 ఉంది.

 

click me!