Gold And Silver Price Today: నేటి ప‌సిడి, వెండి ధరలివే.. తులం బంగారం ధ‌ర‌ ఎంతంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 13, 2022, 08:33 AM IST
Gold And Silver Price Today: నేటి ప‌సిడి, వెండి ధరలివే.. తులం బంగారం ధ‌ర‌ ఎంతంటే..?

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల పెరుగుదల స్వల్పంగానే ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.48,360గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.52,760గా నమోదయ్యాయి. ఢిల్లీలో వెండి రేట్లు మాత్రం యథాతథంగా ఉన్నాయి. కేజీ వెండి ధర ఢిల్లీలో రూ. 62 వేలు పలుకుతోంది.  

బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. జూన్ 13, సోమ‌వారం రోజున‌ హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 10 మాత్రమే పెరిగి రూ. 48,360గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా కేవలం రూ. 10 మాత్రమే పెరిగింది. దీంతో ఈ ధర రూ. 52,760కి ఎగిసింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 500 మేర పెరిగి రూ. 67,500గా నమోదైంది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు సోమ‌వారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక సోమ‌వారం (జూన్ 13, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,760గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,430 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,830గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,360 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,760 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,360 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,760గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,360 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,760గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,000 ఉండగా, ముంబైలో రూ.62,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, కోల్‌కతాలో రూ.62,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, కేరళలో రూ.67,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, విజయవాడలో రూ.67,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gold rate: 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుంది?
Jio Plans: అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజూ 3 జీబీ డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌