Gold And Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 09, 2022, 06:41 AM IST
Gold And Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..!

సారాంశం

బంగారం ధర మెరిసింది. నిన్న పడిపోయిన పసిడి రేటు ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది. జూన్ 9న హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 47,700కు చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా రూ.110 మేర పైకి కదిలింది. దీంతో ఈ బంగారం ధర రూ. 52,040కు ఎగసింది.   

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. బుధవారం స్వల్పంగా తగ్గిన బంగారం.. గురువారం మళ్లీ పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరగగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,040గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 వద్ద కొనసాగుతోంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర నేడు కిలోకు రూ.200 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.68,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు గురువారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక గురువారం (జూన్ 9, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..! 

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,760 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,040 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,700 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.47,700 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,040గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,100 ఉండగా, ముంబైలో రూ.62,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, కోల్‌కతాలో రూ.62,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, కేరళలో రూ.68,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, విజయవాడలో రూ.68,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Economy: వామ్మో..డబ్బు తయారీకే ఇంత ఖర్చా, RBI షాకింగ్ లెక్కలు.
8th Pay Commission DA Hike: 63 శాతానికి డీఏ.. కేంద్రం అదిరిపోయే న్యూస్ ! జీతాలు ఎంత పెరుగుతాయంటే?