బడ్జెట్ ముందు మళ్ళీ భగ్గుమంటున్న క్రూడాయిల్.. నేడు ప్రముఖ నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Jan 31, 2023, 9:27 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 28 సెంట్లు పెరిగి $85.18 డాలర్లకి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 9 సెంట్లు పెరిగి $77.99 డాలర్లకి చేరుకున్నాయని ఒక నివేదిక తెలిపింది.

నేడు వరుసగా 255వ రోజు మంగళవారం అంటే జనవరి 31న పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన  తర్వాత  మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి. తరువాత మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం జూలై 14 2022న పెట్రోల్  పై రూ. 5, డీజిల్‌ పై రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) తగ్గించిన తర్వాత ఇంధన ధరలు దిగోచ్చాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
 ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, 
చెన్నైలో పెట్రోల్ ధర  రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. 
బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 28 సెంట్లు పెరిగి $85.18 డాలర్లకి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 9 సెంట్లు పెరిగి $77.99 డాలర్లకి చేరుకున్నాయని ఒక నివేదిక తెలిపింది.

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు:

1. లక్నోలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76

2. విశాఖపట్నం పెట్రోల్ ధర రూ.110.48, డీజిల్ ధర రూ.98.27

3. అహ్మదాబాద్ పెట్రోల్ ధర రూ.96.63, డీజిల్ ధర రూ.92.38

4.హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

5. పాట్నా పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

click me!