వాహనదారులపై ఇంధన ధరల పిడుగు.. రెండేళ్ల గరిష్టానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

By S Ashok KumarFirst Published Dec 7, 2020, 12:35 PM IST
Highlights

ఢీల్లీలో నేడు పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరల ప్రకారం ఇది వరుసగా 6వ పెంపు.

న్యూ ఢీల్లీ: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం మళ్ళీ పెరిగాయి, దీంతో ఇంధన ధరలు రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. ఢీల్లీలో నేడు పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్ ధర 26 పైసలు పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరల ప్రకారం ఇది వరుసగా 6వ పెంపు.

దేశ రాజధానిలో చమురు మార్కెటింగ్ సంస్థల ధర నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్ ధర రూ.83.41 నుండి 30 పైసలు పెరిగి లీటరుకు రూ.83.71 కు చేరింది, డీజిల్ ధర లీటరుకు రూ.73.61 నుండి  26 పైసలు పెరిగి రూ .73.87కు చేరింది.

ముంబైలో పెట్రోల్ ధరలు రూ.90దాటగా, డీజిల్ ధరలు 80 రూపాయలు దాటాయి. ముంబైలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ.90.34, డీజిల్ ధర రూ.80.51కు పెంచారు.

కోల్‌కతాలో పెట్రోల్ ధర నేడు లీటరుకు రూ .84.86 నుంచి రూ.85.19కు చేరగా, డీజిల్ ధర లీటరుకు 77.15 రూపాయలు నుండి 77.44 రూపాయలు చేరింది.  చెన్నైలో పెట్రోల్ ధర రూ.86.51 వద్ద రిటైల్ అవుతుండగా, ఆదివారం ధర లీటరుకు రూ .86.21గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.78.93 నుంచి రూ.79.21కు పెరిగింది.

also read 

దాదాపు రెండు నెలల విరామం తరువాత చమురు కంపెనీలు రోజువారీ ఇంధన ధరల సవరణను చేస్తూన్నప్పటికి నవంబర్ 20 నుండి 15సార్లు  ఇంధన ధరలను పెంచాయి, నేటి పెంపు వరుసగా ఇది 6 రోజు.

 ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 2.65 రూపాయలు పెరిగగా, డీజిల్ ధర గత 17 రోజుల్లో లీటరుకు రూ .3.40 పెరిగాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు సెప్టెంబర్ 2018 నుండి అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.

ఒపెక్ దేశాలన్నీ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడం, రష్యా కూడా అదే దారిలో నడుస్తూ ఉండటంతోనే క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, నేడు మాత్రం క్రూడాయిల్ ధరలు కొంత మేరకు క్షీణించాయి.

లండన్ మార్కెట్లో ధర అర శాతం పతనమై 49 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ మార్కెట్లో 0.54 శాతం మేరకు క్రూాడాయిల్ ధర తగ్గించింది. ఇక జనవరి 2021లోనూ రోజుకు 7 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తి కోతను కొనసాగిస్తామని రష్యా సహా ఒపెక్ దేశాలు స్పష్టం చేశాయి. దీంతో ధరల పెరుగుదల మరింతగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నేడు హైదరాబాద్ లో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ.86.75 చేరింది. డీజిల్ ధర లీటరుకు 28 పైసలు పెరిగి రూ.80.60 చేరింది.

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు ఇంధన కంపెనీలు సవరిస్తుంటాయి. కొత్త ధరలు ఉదయం 6 నుండి అమల్లోకి వస్తాయి. భారతదేశంలో ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర పన్నులను జోడించిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రెట్టింపు అవుతాయి.

మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరను తెలుసుకోవాలనుకుంటే, మీరు దీన్ని ఎస్‌ఎం‌ఎస్ ద్వారా తెలుసుకొవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు 9224992249 కి 'ఆర్‌ఎస్‌పి' అని టెక్స్ట్ మెసేజ్ చేయవచ్చు, బిపిసిఎల్ వినియోగదారులు 'ఆర్‌ఎస్‌పి' అని టైప్ చేసి 9223112222 కు ఎస్‌ఎం‌ఎస్ పంపవచ్చు. హెచ్‌పిసిఎల్ వినియోగదారులు 'హెచ్‌పిప్రైస్' అని టైప్ చేసి 9222201122 కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.


 

click me!