
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు నేడు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 98.57 డాలర్ల వద్ద, WTI బ్యారెల్‌కు $ 92.61 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఇండియాలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
రాజస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.0.81 పెరిగి రూ.108.88కి, డీజిల్ ధర రూ.0.73 పెరిగి రూ.94.08కి పెరిగింది. పంజాబ్‌లో పెట్రోలు లీటరుకు రూ.0.25 పెరిగి రూ.96.89కి చేరుకుంది. డీజిల్ ధరలు కూడా పెరగడంతో లీటరు రూ.87.24కు చేరింది. అంతేకాకుండా మహారాష్ట్రలో పెట్రోల్ ధర రూ.0.32, డీజిల్ ధర రూ.0.33 తగ్గింది. మరోవైపు దేశంలోని 4 మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76
-చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24
ఈ నగరాల్లో కొత్త ధరలు
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 97, డీజిల్ ధర లీటరుకు రూ. 90.14 అయింది.
–ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 96.58, డీజిల్ ధర లీటరుకు రూ. 89.75కి చేరింది.
-లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.56, డీజిల్ ధర రూ.89.75గా ఉంది.
-పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
–పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.109.66, డీజిల్ రూ.97.82.
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కొత్త ధరలు
ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి కొత్త ధరలు జారీ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌లు ఇంత ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం.
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను సవరిస్తారు. రూపాయితో US డాలర్ మారకం రేటు, ముడి చమురు ధర, ప్రపంచ సంకేతాలు, ఇంధన డిమాండ్ మొదలైన చాలా అంశాలు పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, భారతదేశంలో ఇంధన ధరలపై ప్రభావం ఉంటుంది.