నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. పెట్రోల్ పంప్‌కు వెళ్లే ముందు లీటరు ధర తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Nov 23, 2022, 9:03 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో పెట్రోల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది.

నేడు నవంబర్ 23న పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. దీంతో దాదాపు ఐదు నెలలుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.  దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉన్నాయి. ఈ ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో పెట్రోల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది.

పెట్రోల్, డీజిల్ ధరలు 
బెంగళూరు: పెట్రోల్ లీటరుకు రూ. 101.94, డీజిల్ లీటరుకు రూ. 87.89
లక్నో: పెట్రోలు లీటరుకు రూ. 96.57, డీజిల్ లీటరుకు రూ. 89.76
నోయిడా: పెట్రోలు లీటరుకు రూ. 96.79, డీజిల్ లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోలు లీటరుకు రూ. 97.18, డీజిల్ లీటరుకు రూ. 90.05,
చండీగఢ్ : పెట్రోలు ధర రూ. 96.20, డీజిల్ ధర  రూ. 84.26
ముంబై: పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27
ఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62,
 చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24
కోల్‌కతా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76

హైదరాబాద్ లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతుంటాయి. వాల్యు ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి.

click me!