ఇండియా ప్రపంచంలో పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారవచ్చు: నిర్మల సీతారామన్

Ashok Kumar   | Asianet News
Published : Nov 23, 2020, 07:32 PM IST
ఇండియా ప్రపంచంలో పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారవచ్చు: నిర్మల సీతారామన్

సారాంశం

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) సోమవారం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ విషయం తెలిపారు. భారతదేశాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

భారతదేశం ప్రపంచంలో ఒక ప్రధాన పెట్టుబడి కేంద్రంగా మారగలదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) సోమవారం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ విషయం తెలిపారు.

భారతదేశాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.  సంస్కరణలను ప్రస్తావిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వీటిని కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరికొన్ని పెద్ద సంస్కరణలను కూడా ఆమే సూచిస్తూ, సంస్కరణల వేగం కొనసాగించబడుతుందని సీతారామన్ స్పష్టం చేశారు.

మరికొన్ని సంస్కరణలకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలు సమయానుకూలమైనవి ఆని, అవి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు సూచిస్తుంది.

also read ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వివాదం.. అతను ఎవరో తెలీదంటూ మాట మార్చిన రామలింగరాజు.. ...

పండుగ సీజన్లో వినియోగదారుల డిమాండ్‌ను ప్రోత్సహించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి హాలిడే ట్రావెల్ కన్‌సెషన్ (ఎల్‌టిసి) బదులుగా నగదు చెల్లింపును, ప్రభుత్వ ఉద్యోగులకు 10వేల రూపాయల ముందస్తు చెల్లింపును నిర్మల సీతారామన్ ప్రకటించారు.

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటనలు సకాలంలో వినియోగదారుల వ్యయం, అవగాహనను, అలాగే మూలధన వ్యయం పెంచుతాయి. మన ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌ను కూడా పెంచుతాయి అని తెలిపారు. 

సమావేశంలో ప్రసంగించిన నిర్మలా సీతారామన్ ప్రధాని మోడీ ప్రయత్నాలను ప్రశంసిస్తూ, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కూడా, ప్రధాని లోతైన సంస్కరణలు తీసుకొని చేపట్టారు అని అన్నారు. గత నెలలో నిర్మల సీతారామన్ ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు.  

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
Silver ETF: వెండిని ఇలా తెలివిగా కొనండి.. ఇష్టం ఉన్న‌ప్పుడు, ఒక్క క్లిక్‌తో అమ్ముకోవ‌చ్చు