ప్లిప్ కార్ట్ సీఈవో బిన్ని బన్సల్ రాజీనామా....ఆమోదించిన వాల్ మార్ట్

By Arun Kumar PFirst Published Nov 13, 2018, 8:18 PM IST
Highlights

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ప్లిప్ కార్ట్ సీఈవో పదవి నుండి తప్పుకుటుంన్నట్లు ఆ సంస్థ కో ఫౌండర్ బిన్నీ బన్సల్ ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామాను కూడా ప్లిప్ కార్ట్ మాతృసంస్థ వాల్ మార్ట్ కు పంపించారు. ఆ రాజీనామాను వెంటనే ఆమోదిస్తున్నట్లు వాల్ మార్ట్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా ప్లిప్ కార్ట్ ఏర్పాటులో ప్రముఖ పాత్ర వహించిన బిన్ని అవమానకర రీతిలో ఆ సంస్థకు దూరమవ్వాల్సి వచ్చింది. 

కొన్ని నెలల క్రితమే ప్లిప్ కార్ట్ ను అంతర్జాతీయ దిగ్గజం వాల్ మార్ట్ భారీ ధర చెల్లించి దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొనుగోలు తర్వాత వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సచిన్ బన్సల్ తన పూర్తి వాటాను అమ్ముకొని తప్పుకున్నారు. అయితే బిన్ని మాత్రం ప్లిప్ కార్ట్ సంస్థకు సీఈవో గా కొనసాగారు. అయితే తాజాగా సంస్థలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అతడు రాజీనామా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. 

బిన్నీ వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదన్న ఆరోపణలు ఈ మధ్య ఎక్కువయ్యాయి.  అయితే ఈ ఆరోపణలపై బిన్నీ స్పందన కూడా సరిగా లేదని వాల్ మార్ట్ గతకొంతకాలంగా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో అతడిపై స్వతంత్ర విచారణకు కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బిన్నీ కూడా సంస్థను వీడటానికి సిద్దమయ్యాడు. ఈ విచారణ కూడా పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించినట్లు వాల్‌మార్ట్ వెల్లడించింది.  
 
click me!