Fire-Bolt Phoenix Pro: స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, మీ బడ్జెట్ కేవలం రూ.2000 లోపేనా, ఇది మీకోసం

Published : Feb 26, 2023, 02:20 PM IST
Fire-Bolt Phoenix Pro: స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, మీ బడ్జెట్ కేవలం రూ.2000 లోపేనా, ఇది మీకోసం

సారాంశం

కొత్త స్మార్ట్ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే మీ బడ్జెట్ కేవలం రూ2 వేల లోపే ఉండాలని అనుకుంటున్నారా, అయితే Fire Bolt Phoenix Pro మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ వాచ్ ధర, ఫీచర్లను తెలుసుకుందాం. 

ఫైర్-బోల్ట్ తన కొత్త స్మార్ట్ వాచ్ ఫీనిక్స్ ప్రోను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత ఏమంటంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. Fire-Boltt Phoenix Pro పూర్తి మెటల్ షాక్ ప్రూఫ్ బాడీతో  వస్తోంది. ఇందులో మీకు 1.39 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. ఇందులోని బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ సహాయంతో, మీరు నేరుగా కాల్‌లకు సమాధానం ఇవ్వవచ్చు. అయితే ఈ ఫీనిక్స్ ప్రో స్మార్ట్ వాచ్ కేవలం  ధర రూ.2000 కంటే తక్కువ కావడం విశేషం. ఫైర్-బోల్ట్ నుండి కొత్త స్మార్ట్‌వాచ్ అయిన ఫీనిక్స్ ప్రో , ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం .

Fire-Bolt Phoenix Pro with Voice Command ఫీచర్
Fire-Bolt Phoenix Pro వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో వస్తుంది. దీనితో మీరు రిమైండర్‌లను సెట్ చేయవచ్చు.  మీ ఫిట్‌నెస్ టార్గెట్ సాధించడంలో మీకు సహాయపడటానికి ఫీనిక్స్ ప్రో స్మార్ట్‌వాచ్ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ స్థాయి ,  స్లీప్ టైమర్ ముఖ్యమైన ఫీచర్లు. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ వాచ్ మహిళల ఆరోగ్య ట్రాకర్ గానూ ,  ధ్యానం శ్వాసపై ధ్యాస  వంటి ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. దీని సహాయంతో, మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవచ్చు.  

స్మార్ట్‌ఫోన్ కెమెరాను Phoenix Proతో నియంత్రించవచ్చు Phoenix Pro సూపర్ స్మూత్ స్క్రోలింగ్ ,  నావిగేషన్ అనుభవం కోసం 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మీరు 240x240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.39 అంగుళాల డిస్‌ప్లే పొందుతారు. ఈ స్మార్ట్ వాచ్ వాతావరణ అప్‌డేట్, డ్రింక్ వాటర్ రిమైండర్, కెమెరా కంట్రోల్, అలారం ,  స్టాప్‌వాచ్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. అలాగే ఇది అనేక ఇన్ బిల్ట్ గేమ్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను సాధారణ మోడ్‌లో 7 రోజులు ,  స్టాండ్‌బైలో 30 రోజులు ఒకసారి పూర్తి ఛార్జ్ తర్వాత ఉపయోగించవచ్చు. 

ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో ధర
ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో ధర గురించి మాట్లాడితే, దీని ధర రూ.2000 కంటే తక్కువ. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, గ్రే ,  పింక్ కలర్ వేరియంట్లలో లాంచ్ చేయబడింది. మీరు అమెజాన్ నుండి రూ.1,799కి కొనుగోలు చేయవచ్చు. 
 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon Jobs : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు... అమెజాన్ లో 10 లక్షల జాబ్స్..!
Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది