వచ్చే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ -3 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటుంది: ముకేష్ అంబానీ

Ashok Kumar   | Asianet News
Published : Dec 16, 2020, 06:43 PM ISTUpdated : Dec 16, 2020, 11:10 PM IST
వచ్చే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ -3 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటుంది: ముకేష్ అంబానీ

సారాంశం

"రాబోయే రెండు దశాబ్దాలలో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగాలని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత  ముకేష్ అంబానీ అన్నారు.

న్యూ ఢీల్లీ, డిసెంబర్ 15: ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో జరిగిన వర్చువల్ మీటింగ్ (ఫేస్‌బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020) లో ఆసియా అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా అభివృద్ధి చెందుతుందని, తలసరి ఆదాయం రెట్టింపు అవుతుందని అన్నారు.

ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో దేశంలోని మొత్తం గృహాలలో 50 శాతం ఉన్న భారతదేశ మధ్యతరగతి సంవత్సరానికి మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతుందని ఆయన అన్నారు.

"రాబోయే రెండు దశాబ్దాలలో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగాలని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత  ముకేష్ అంబానీ అన్నారు."మా తలసరి ఆదాయం తలసరి 1,800-2,000 డాలర్ల నుండి 5,000 డాలర్లకు చేరుకుంటుంది" అని ఆయన చెప్పారు.

also read కొత్తగా పెళ్లి చేసుకునే వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుండి వధువుకు 10గ్రాముల బంగారం బహుమతిగా.. ...
    
రాబోయే దశాబ్దాల్లో వేగవంతం కానున్న ఈ ఆర్థిక, సామాజిక మార్పులో భాగంగా ఫేస్‌బుక్, ప్రపంచంలోని అనేక సంస్థలు, పారిశ్రామికవేత్తలు భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఒక సువర్ణావకాశంగా ఉందని అంబానీ అన్నారు. భారతదేశంలో జియో, వాట్సాప్ వినియోగదారుల సంఖ్య దాదాపు సమానంగా ఉందని తెలిపారు.

భారతదేశం మాకు చాలా ప్రత్యేకమైన, ముఖ్యమైన దేశం. కోట్ల మంది ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి ప్రతిరోజూ మా  ప్లాట్ ఫార్మలను ఉపయోగిస్తున్నారు.

అది వాట్సాప్ అయినా, ఫేస్‌బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా కావొచ్చు. ఇది కాకుండా, దేశంలోని కోట్లాది చిన్న వ్యాపారాలు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి వాట్సాప్ బిజినెస్ యాప్ ని ఉపయోగిస్తున్నారు. గత నెలలో మేము భారతదేశంలో వాట్సాప్ పేని ప్రారంభించాము.
 

PREV
click me!

Recommended Stories

Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !