విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా బంపర్ ఆఫర్‌.. టికెట్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్..

Ashok Kumar   | Asianet News
Published : Dec 16, 2020, 03:54 PM ISTUpdated : Dec 16, 2020, 11:11 PM IST
విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా బంపర్ ఆఫర్‌.. టికెట్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్..

సారాంశం

ఎయిర్ ఇండియా వృద్ధులకు, సీనియర్‌ సిటిజన్లకు బంపర్ ఆఫర్ అందించనుంది. ఎయిర్ ఇండియా 60 ఏళ్ల వయసు దాటిన వారికి టిక్కెట్ల కొనుగోలులో 50% డిస్కౌంట్ శాతం ఇస్తుంది.

న్యూ ఢీల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, చాలా మంది ప్రజలు విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే విమానంలో ప్రయాణించడం కూడా కాస్త ఖరీదైనది. ఎయిర్ ఇండియా వృద్ధులకు, సీనియర్‌ సిటిజన్లకు బంపర్ ఆఫర్ అందించనుంది.

ఎయిర్ ఇండియా 60 ఏళ్ల వయసు దాటిన వారికి టిక్కెట్ల కొనుగోలులో 50% డిస్కౌంట్ శాతం ఇస్తుంది. ఎయిర్ ఇండియా సంస్థ  అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఇప్పుడు టికెట్ ధరలో 50% డిస్కౌంట్  తో విమాన ప్రయాణాలు చేయవచ్చు. 

ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్ల కొన్ని నిబంధనలు :

- ప్రయాణికుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై, అలాగే 60 సంవత్సరాలు నిండి ఉండాలి .

- చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి ఉండాలి (వోటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ ).

-  ఇది ఎకానమీ క్లాస్‌కు మాత్రమే వర్తించనుంది. బేస్‌ ధరలో 50 శాతం చెల్లించడం ద్వారా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. 

also read పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. 2 వారాల్లో రూ. 100 పెంపు.. ...

- మీరు బయలుదేరే మూడు రోజుల ముందు టికెట్లను కొనుగోలు చేయాలి.

- ఈ ఆఫర్ భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

- ఈ ఆఫర్ టికెట్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది.

2 ఏళ్ల వయసులోని పిల్లలకు సైతం టికెట్‌ ధరలో తగ్గింపు అమలుకానున్నట్లు ఎయిర్‌ ఇండియ వర్గాలు వెల్లడించాయి. అయితే వారి పిల్లలలో ఒక్కరికీ మాత్రమే తగ్గింపు  ఉంటుంది.

అది కూడా రూ. 1,250 కూపన్‌, పన్నులు వర్తిస్తాయని తెలియజేశాయి. ఎయిర్‌ ఇండియా నిర్వాహక విమానాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నాయి. మిగిలిన పూర్తి వివరాలకు ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌ను చూడవచ్చు. 
 

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?