కరోనా కష్టాల్లో ఫేస్‌బుక్‌కు భలే లాభాలు..

By Sandra Ashok KumarFirst Published Jul 31, 2020, 1:17 PM IST
Highlights

 ఈ త్రైమాసంలో ఫేస్‌బుక్‌ రాబడి ఏకంగా 11 శాతం పెరిగి దాదాపు 1.3 లక్షల కోట్లకు ఎగిసింది. రెండో క్వార్టర్‌లో 314 కోట్ల మంది ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌, మెసెంజర్‌ వంటి ఎఫ్‌బీ యాప్స్‌ను ఉపయోగించుకున్నారు. 

యాడ్స్ బై కాట్,  విద్వేష కంటెంట్‌పై విమర్శలు వెల్లువెత్తినా పలు ప్రతికూలతల మధ్య సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ రెండో త్రైమాసంలో భారీ రాబడిని ఆర్జించింది. ఈ త్రైమాసంలో ఫేస్‌బుక్‌ రాబడి ఏకంగా 11 శాతం పెరిగి దాదాపు 1.3 లక్షల కోట్లకు ఎగిసింది.

రెండో క్వార్టర్‌లో 314 కోట్ల మంది ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌, మెసెంజర్‌ వంటి ఎఫ్‌బీ యాప్స్‌ను ఉపయోగించుకున్నారు. డైలీ యాక్టివ్‌ యూజర్లు 12 శాతం పెరిగి 179 కోట్లకు చేరారు. అన్ని కంపెనీల తరహాలోనే తమ వ్యాపారం కూడా కోవిడ్‌-19తో ప్రభావితమైందని రాబోయే రోజుల్లో తమ వాణిజ్య పరిస్థితిపై అనిశ్చితి నెలకొందని ఫేస్‌బుక్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

శాన్ఫ్రాన్సిస్కో:  విద్వేషపూరిత కంటెంట్‌ పై విమర్శలు  వెల్లువెత్తినా పలు ప్రతికూలతల మధ్య సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ షేర్లు 7 శాతానికి పైగా పెరిగాయి, సోషల్ నెట్‌వర్క్ నికర ఆదాయం 5.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది, ఆదాయం 11 శాతం పెరిగి 18.69 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


"ఈ సమయంలో చిన్న వ్యాపారాల వారు ఎదగడానికి, ఆన్‌లైన్‌లో విజయవంతం కావడానికి అవసరమైన సాధనాలను అందించగలిగినందుకు మేము సంతోషిస్తున్నాము" అని ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు.

"ప్రజలు వ్యక్తిగతంగా కలిసి ఉండలేనప్పుడు వారు కనెక్ట్ అవ్వడానికి మా సేవలపై ఆధారపడటం మేము గర్విస్తున్నాము". నెలవారీ యూసర్లు(ఎంఐయు) 2.7 బిలియన్లకు పెరిగింది, రోజువారీ వినియోగదారులు (డిఎయు) 12 శాతం పెరిగి 1.79 బిలియన్లకు (జూన్ 30 నాటికి)పెరిగింది.

మొదటి త్రైమాసికంలో 2.99 బిలియన్లతో పోల్చితే ఫేస్‌బుక్ ఫ్యామిలీ యాప్స్ (ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సాప్) లో 3.14 బిలియన్ల నెలవారీ వినియోగదారులు పెరిగారు."మా వ్యాపారం కోవిడ్-19 మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావమైంది.

అన్ని సంస్థలలాగానే, మేము మా వ్యాపార దృక్పథంలో అపూర్వమైన అనిశ్చితిని ఎదుర్కొంటున్నాము" అని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫేస్‌బుక్ 2020లో మొత్తం ఖర్చులు 52-55 బిలియన్ డాలర్ల పరిధిలో ఉంటుందని అంచనా వేసింది, ఇది మునుపటి శ్రేణిలో 52-56 బిలియన్ డాలర్ల కంటే కొద్దిగా తగ్గింది.  
 

click me!