పెట్రోల్ బాదుడు.. తెలుగు రాష్ట్రలలో ఇంధన ధరల పై ఎంత పన్ను వసూలు చేస్తున్నారంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Mar 24, 2022, 11:07 AM ISTUpdated : Mar 24, 2022, 11:08 AM IST
పెట్రోల్ బాదుడు..  తెలుగు రాష్ట్రలలో ఇంధన ధరల పై ఎంత పన్ను వసూలు చేస్తున్నారంటే..?

సారాంశం

దేశంలో పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ నాలుగు నెలలకు పైగా ధరలు స్థిరంగా ఉన్నాయి.  వాల్యు ఆధారిత పన్ను కారణంగా ప్రతి రాష్ట్రానికి ఇంధన ధరలు మారుతూ ఉంటాయి.    

పెట్రోలు, డీజిల్ ధరలు మార్చి 23న వరుసగా రెండో రోజు లీటర్‌కు 80 పైసలు చొప్పున పెరిగాయి. రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు  రూ.97.01 కాగా, డీజిల్  రూ.88.27గా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.111.67 వద్ద, డీజిల్ లీటరుకు  రూ.95.85 వద్ద విక్రయిస్తున్నారు. దేశంలోని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు  ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. వాల్యు ఆధారిత పన్ను కారణంగా ప్రతి రాష్ట్రానికి ఇంధన ధరలు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ నాలుగు నెలలకు పైగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.  

గత నెల ఫిబ్రవరిలో పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రశ్నలకు సమాధానమిస్తూ చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ రిటైల్ రేట్లు అంతర్జాతీయ ధరల ప్రకారం నియంత్రించబడతాయి, ఎందుకంటే ఇంధన అవసరాలను తీర్చడానికి భారత దేశం దిగుమతులపై 85 శాతం ఆధారపడుతుంది. పెట్రోల్ రిటైల్ ధర 3 వేర్వేరు భాగాలతో రూపొందించబడుతుంది. వీటిలో అంతర్జాతీయ చమురు ధర, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులను ప్రతిబింబించే బేస్ ధర ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అభివృద్ధి అలాగే సంక్షేమ ప్రాధాన్యతలను నెరవేర్చడానికి ఈ ఉత్పత్తులపై పన్నుల నుండి వచ్చే వసూళ్లపై ఎక్కువగా ఆధారపడతాయని చెప్పారు.  

ప్రభుత్వ డేటా ప్రకారం, స్టాట్స్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన దాని ప్రకారం, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 రూపాయల పెట్రోల్‌కు ఎంత మొత్తం పన్ను చెల్లించబడుతుందో వివరించింది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పెట్రోలు ధరలో సగం పన్నుగా వసూలు చేస్తున్నారు. ఇందులో మహారాష్ట్ర రూ.52.5, ఆంధ్రప్రదేశ్ రూ.52.4, తెలంగాణ రూ.51.6, రాజస్థాన్ రూ.50.8, మధ్యప్రదేశ్ రూ.50.6, కేరళ రూ.50.2, బీహార్ రూ.50.

భారత గణాంకాల ప్రకారం
అండమాన్ & నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, పుదుచ్చేరి, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌లు అత్యల్ప పన్నులు కలిగిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యధిక పన్ను రేట్లు ఉన్నాయి. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ & అనాలిసిస్ సెల్ నుండి ఈ డేటా తీసుకోబడింది

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే