ఇక ఫ్లిప్ కార్ట్, అమేజాన్ భారీ డిస్కౌంట్లకు చెక్...

By ramya neerukondaFirst Published Dec 27, 2018, 11:53 AM IST
Highlights

ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. ఈ కామర్స్ సంస్థలు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లు వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లకు తెరలేపేవి. అతి తక్కువ ధరకు గ్యాడ్జెట్స్, దుస్తులు ఆఫర్ చేసేవి. కానీ.. ఇక నుంచి అలా భారీ డిస్కౌంట్ సేల్ ఆఫర్ చేసే అవకాశం లేకుండా పోయింది. 

దేశంలోని ఈ-కామర్స్ కంపెనీల ఉత్పత్తి విక్రయ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ కామర్స్ పోర్టళ్లు తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధం విధించింది. ఏదైనా ఉత్పత్తిని ప్రత్యేకంగా తమ ఫ్లాట్ ఫామ్ ద్వారానే విక్రయించేలా ఈ-కామర్స్ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా నిషేధించింది.

అంతేకాదు, ఈ-కామర్స్‌ మార్కెట్‌ప్లేస్‌ సంస్థ తాను లేదా తన గ్రూపు కంపెనీలు కొనుగోలుదారులకు ఆఫర్‌ చేసే క్యాష్‌ బ్యాక్‌లు సముచితంగా, వివక్షారహితంగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇకపై ఈ-కామర్స్‌ కంపెనీలు గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను నిబంధనలకు లోబడి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపే సర్టిఫికేట్‌తోపాటు చట్టబద్ద ఆడిటర్‌ రిపోర్టును ఏటా సెప్టెంబరు30కల్లా ఆర్‌బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. 

కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్‌ కంపెనీలు అసాధారణ స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయని, దాంతో వ్యాపారాలకు తీవ్ర నష్టం జరుగుతోందంటూ దేశంలోని పలు వర్తకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సైట్లపై ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

click me!