Rishabh Instruments IPO Listing : ఇన్వెస్టర్లకు లిస్టింగ్ రోజు నష్టాలు మిగిల్చిన రిషబ్ ఇన్ స్ట్రుమెంట్స్ ఐపీవో

By Krishna Adithya  |  First Published Sep 11, 2023, 12:50 PM IST

రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ లిస్టింగ్ ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చింది. ఇష్యూ ధర రూ.441 వద్ద కంపెనీ షేరు కేవలం 4 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అవగా తర్వాత కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 


Rishabh Instruments IPO Listing : గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సొల్యూషన్స్ కంపెనీ రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ లిస్టింగ్ ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు చేదు మిగిల్చింది.  కంపెనీ షేర్లు బిఎస్‌ఇలో రూ.460 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ.441 కాగా కేవలం 4 శాతం ప్రీమియంతో లిస్టింగ్ పూర్తయింది. లిస్టింగ్ తర్వాత షేర్ దాదాపు రూ.430కు పడిపోయింది. మార్కెట్‌లో రిస్క్‌ తీసుకోలేకపోతే షేర్లు విక్రయించి నిష్క్రమించాలని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు గరిష్ట షేరు ధర రూ.470, కనిష్ట ధర రూ.432. ప్రస్తుతం రూ.450 వరకు విక్రయిస్తున్నారు.

రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఈ IPOలో, 50 శాతం షేర్లు QIB కోసం రిజర్వ్ చేయబడ్డాయి. అది 72.54 సార్లు పూరించింది. 15 శాతం వాటా NII కోసం రిజర్వ్ చేశారు. అది సుమారు 31.29 సార్లు సబ్ స్క్రయిబ్, IPOలో 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయగా, 8.44 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. మొత్తంమీద ఈ ఇష్యూ 31.65 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.

Latest Videos

పెట్టుబడిదారులు స్టాక్‌లను విక్రయించాలి
ప్రముఖ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ అనుభవి మిశ్రా మాట్లాడుతూ, రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిస్టింగ్ సందిగ్ధంలో ఉంది, ఇష్యూ ధర రూ. 441తో పోలిస్తే 4 శాతం ప్రీమియంతో రూ. 460 వద్ద లిస్ట్ అయ్యింది.  ఇది ఇంధన సామర్థ్య పరిష్కారాలను అందించే బహుళజాతి సంస్థ. ఇది విభిన్నమైన మాన్యుఫాక్చరింగ్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉంది.  కంపెనీ అంతర్జాతీయంగా పలు కంపెనీలు ఎదుర్కొంటున్న సెమీకండక్టర్లు, అలాగే ఇతర ఉత్పత్తి ఇన్‌పుట్‌ల కొరతకు సంబంధించిన నష్టాలను ఎదుర్కొంటుంది. IPO వాల్యుయేషన్ కూడా కొంచెం ఎక్కువ. లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు తమ పొజిషన్ల నుంచి వైదొలిగేందుకు సిద్దంగా ఉన్నారు.అయితే, ఎవరైనా హై రిస్క్ ఇన్వెస్టర్ అయితే, అతను IPO ధరపై స్టాప్ లాస్ పెట్టి దానిని ఉంచుకోవచ్చు. అని ఆమె సూచించారు. 

కంపెనీ ఏమి చేస్తుంది
రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అనేది ఎలక్ట్రికల్ ఆటోమేషన్ డివైసెస్, మీటరింగ్, కంట్రోల్, ప్రొటెక్షన్ డివైసెస్, పోర్టబుల్ టెస్ట్ , మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిజైన్, డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయ్‌లో నిమగ్నమై ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్లేయర్. కంపెనీ షేర్ల ముఖ విలువ ఒక్కో షేరుకు రూ.10గా నిర్ణయించారు. ఈ కంపెనీ షేర్లు BSE, NSE రెండింటిలోనూ లిస్ట్ అయ్యింది. 2023లో రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ నిర్వహణ ఆదాయం ఏడాది క్రితం రూ.569.54 కోట్లుగా ఉండగా, ఇది రూ.569.54 కోట్లకు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పన్ను తర్వాత కంపెనీ లాభం రూ. 49.69 కోట్లుగా నమోదు అయ్యింది. 

click me!