New Mobile tracking system: ఫోన్ పోయిందా అయితే చింతవద్దు, మే 17 తర్వాత కొత్త ట్రాకింగ్ సిస్టం అమలు చేసే చాన్స్

By Krishna Adithya  |  First Published May 15, 2023, 4:10 AM IST

మీ ఫోన్ పోయిందా అయితే చింతించకండి..మే 17 నుంచి సరికొత్త టెక్నాలజీ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ద్వారా మీ ఫోన్ లను ట్రాక్ చేయనున్నారు. తద్వారా మీరు పోగొట్టుకున్న ఫోన్ ను బ్లాక్ లేదా ట్రేస్ చేయవచ్చు. 


కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో కొత్త మొబైల్ ట్రాకింగ్  వ్యవస్థను ప్రారంభించబోతోందనే వార్తలు టెక్నాలజీ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు పారేసుకున్న లేదా దొంగిలించిన మొబైల్ ఫోన్‌లను బ్లాక్ లేదా ట్రేస్ చేయగలుగుతారు. ఈ మేరకు ఒక కీలక సమాచారాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బాడీ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (CDOT) తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య ప్రాంతంతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో పైలట్ ప్రాతిపదికన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పేరిట ఈ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేయనుంది. ఇప్పుడు ఈ వ్యవస్థను త్వరలోనే అఖిల భారత స్థాయిలో ప్రారంభించవచ్చని టెలికాం శాఖ అధికారి  PTI వార్తా సంస్థతో తెలిపారు. 

మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు:

Latest Videos

undefined

సీఈఐఆర్ (CEIR) సిస్టమ్ ను ఈ నెల 17 నుంచి  ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. అలాగే CDOT CEO, ఛైర్మన్ ప్రాజెక్ట్ బోర్డ్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్‌ మాత్రం  ఇంకా తేదీని ధృవీకరించలేదు, అయితే ట్రాకింగ్ టెక్నాలజీని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మరిన్ని విషయాలు తెలుపుతూ,మొబైల్ ట్రాకింగ్  వ్యవస్థ సిద్ధంగా ఉంది.  ఈ త్రైమాసికంలో భారతదేశం అంతటా అమలు చేస్తామని తెలిపారు. ఇది ప్రజలు తమ కోల్పోయిన మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని ట్రేస్ చేయడానికి CDOT కొత్త ఫీచర్‌లను జోడించినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇఫ్పటికే భారతదేశంలో మొబైల్ పరికరాలను విక్రయించే ముందు అంతర్జాతీయ మొబైల్ పరికరాల గుర్తింపు (IMEI-15 అంకెల సంఖ్య)ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

IMEI నంబర్ ,  దానితో అనుబంధించిన మొబైల్ నంబర్ గురించి సమాచారం ఉంటుంది. మొబైల్ నెట్‌వర్క్‌లు తమ నెట్‌వర్క్‌లోకి అనధికారిక మొబైల్ ఫోన్ ఎంట్రీని గుర్తించడానికి ఆమోదించబడిన IMEI నంబర్‌ల జాబితాను కలిగి ఉంటాయి. టెలికాం ఆపరేటర్లు ,  CEIR సిస్టమ్ పరికరం ,  IMEI నంబర్ ,  దానితో అనుబంధించబడిన మొబైల్ నంబర్‌కు యాక్సెస్ కలిగి ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో, పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను ట్రేస్ చేయడానికి ఈ సమాచారం CEIR ద్వారా పొందే వీలుంది. 

 

click me!