
Twitter CEO Parag Agarwal: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ లో మేజర్ వాటాలను కొనుగోలు చేసినప్పటి నుంచి, ట్విట్టర్ సంస్థ పాతయాజమాన్యం గుండెల్లో గంటలు మోగుతున్నాయి. ఇటీవలే సంస్థ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పరాగ్ అగర్వాల్ స్థానంలో, వేరొకరిని నియమించాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారు. వీలైతే తానే ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆయన ఊవిళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఈవో పరాగ్ అగర్వాల్ సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఓ ట్వీట్ లో పరాగ్ తన భావాలను వెల్లిబుచ్చుతూ - తన ఉద్యోగం గురించి ఆందోళన చెందడం లేదని. కంపెనీ భవిష్యత్తు గురించి మరింత ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నాడు.
ఒక Twitter ఖాతాదారుడు ఇటీవల ఓ పోస్ట్ లో Twitter యొక్క ప్రస్తుత CEO పరాగ్, భవిష్యత్ పై మంచి ప్రణాళికలతో ముందుకు వచ్చారు. కానీ ప్రస్తుతం అతడి టీం మొత్తం అనిశ్చితితో జీవిస్తోంది." అనే ట్వీట్‌పై అగర్వాల్ స్పందిస్తూ, తన ఉద్యోగం గురించి పట్టించుకోనని, అయితే కంపెనీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని చెప్పాడు.
అలాగే "ధన్యవాదాలు కానీ నా పట్ల అలాంటి భావాన్ని కలిగి ఉండకు. నా సేవలను ప్రజలకు అందించడం మెరుగుపరచడం చాలా ముఖ్యమైనది" అని అగర్వాల్ బదులిచ్చారు.
అంతకుముందు, తనను తొలగించడం గురించి మరొక యూజర్ కు స్పందిస్తూ, అగర్వాల్ ఇలా అన్నారు.. "లేదు! మేము ఇంకా ఇక్కడే ఉన్నాము." బహుశా, మస్క్ తనతో సహా అనేక మంది ఉద్యోగులను తొలగించగలడని భావిస్తున్నట్లు తెలిపాడు.
తాజాగా రాయిటర్స్ నివేదిక ప్రకారం, మస్క్ ఇప్పటికే ట్విట్టర్ కోసం కొత్త సీఈవోని నియమించే పనులను వేగవంతం చేశాడు. ఈ సంవత్సరం చివర్లో 44 బిలియన్ డాలర్ల విక్రయ ఒప్పందం పూర్తయిన తర్వాత అగర్వాల్ స్థానంలో కొత్త సీఈవో ఉంటాడు. గత ఏడాది జాక్ డోర్సే రాజీనామా చేసిన తర్వాత అగర్వాల్ నవంబర్ 2021లో ట్విట్టర్ సీఈఓగా నియమితులయ్యారు.
అయితే నివేదికల ప్రకారం, ట్విట్టర్‌లో 12 నెలలలోపు మస్క్ అగర్వాల్‌ను తొలగిస్తే 43 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో మస్క్ ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్‌తో మాట్లాడుతూ, కంపెనీ నిర్వహణపై తనకు నమ్మకం లేదని, అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహణను పునర్నిర్మించాలని సూచించాడు.
అదనంగా, మస్క్ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దెని తొలగించాలని యోచిస్తున్నట్లు ది న్యూయార్క్ పోస్ట్ నుండి వచ్చిన నివేదిక సూచించింది. ఆ పదవి నుండి తొలగిస్తే, గద్దెకు ట్విట్టర్ షేర్లతో సహా 12.5 మిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీ లభిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
విజయ గద్దె ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 17 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. ఆమె కంపెనీలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా ఉన్నారు.