ఐపీవోలో డబ్బు సంపాదించాలని ఉందా..అయితే నేటి నుంచి Nexus Select Trust IPO షురూ..మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలంటే

By Krishna AdithyaFirst Published May 9, 2023, 2:38 PM IST
Highlights

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ Nexus సెలెక్ట్ ట్రస్ట్  IPO నేటి నుండి సబ్ స్క్రిప్షన్  కోసం తెరుచుకుంది. దీని ఒక యూనిట్ ధర 95 నుండి 100 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో, దరఖాస్తుదారులు కనీసం 1500 యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంటే పెట్టుబడిదారులు కనీసం రూ. 15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మీరు IPO ద్వారా స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. Nexus Select Trust REIT IPO సబ్‌స్క్రిప్షన్ ఈరోజే తెరుచుకుంది.  రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ Nexus సెలెక్ట్ ట్రస్ట్ IPO నేటి నుండి సబ్ స్క్రిప్షన్  కోసం బిడ్స్ ఆహ్వానిస్తోంది. దీని ఒక యూనిట్ ధర 95 నుండి 100 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో, దరఖాస్తుదారులు కనీసం 1500 యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంటేఈ ఐపీవో ద్వారా ఇన్వెస్టర్లు కనీసం రూ. 15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే  ఇందులో మే 11 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. Nexus సెలెక్ట్ ట్రస్ట్ భారతదేశపు మొదటి REIT (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) IPO. ఇది బయట పెట్టబడిన రిటైల్ రియల్ ఎస్టేట్ ఆస్తుల ద్వారా మద్దతునిస్తుంది. రిటైల్ REIT IPO ద్వారా కంపెనీ రూ.3,200 కోట్లు సమీకరించనుంది.

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 1,440 కోట్లు సేకరించారు
Nexus సెలెక్ట్ ట్రస్ట్‌లో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం అప్లికేషన్ ఇప్పటికే తెరుచుకుంది. దీంతో కంపెనీ రూ.1,440 కోట్లు సమీకరించింది. ఈ రోజు నుండి ఇది సాధారణ ప్రజలకు, మరికొందరు పెట్టుబడిదారులకు తెరిచి ఉంది. ఈ IPO కోసం యూనిట్ ధర బ్యాండ్ రూ.95 నుండి రూ.100గా నిర్ణయించబడింది. ఇందులో, కనీసం 1500 యూనిట్లు కొనాలి. అంటే ఈ IPOలో డబ్బును పెట్టుబడి పెట్టాలంటే, పెట్టుబడిదారులు కనీసం రూ. 15,000 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.

IPO లీడ్ మేనేజర్లు ఎవరు
 మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్ BoA ML బుకింగ్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నారు. ఈ IPO పరిమాణం గురించి మాట్లాడితే, Nexus Select Trust REIT IPOలో రూ. 1,400 కోట్ల విలువైన తాజా షేర్లు జారీ చేస్తారు.

Nexus సెలెక్ట్ ట్రస్ట్ IPO గ్రే మార్కెట్‌లో సానుకూలంగా ట్రేడవుతోంది. నిన్న సాయంత్రం దాని ఒక యూనిట్‌కు రూ. 4 నుండి 5 ప్రీమియం కోట్ చేశారు. రూ. 100 షేర్‌పై రూ. 5 జీఎంపీ అంటే దానిపై ఐదు శాతం ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. Nexus సెలెక్ట్ ట్రస్ట్ వ్యాపారం గురించి మాట్లాడుకుంటే, ఇది దేశంలోనే అతిపెద్ద మాల్ ప్లాట్‌ఫారమ్. కంపెనీ 14 ప్రధాన నగరాల్లో 17 ప్రీమియం ఆస్తులను కలిగి ఉంది.

click me!