నరేష్ గోయల్ కు చుక్కెదురు: రూ.18వేలు కోట్లు డిపాజిట్ చేయండి

By narsimha lodeFirst Published Jul 9, 2019, 5:27 PM IST
Highlights

జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. దేశం విడిచివెళ్లాలంటే రూ.18వేల కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
 

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. దేశం విడిచివెళ్లాలంటే రూ.18వేల కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాలని ఆదేశించింది.

దేశం విడిచి వెళ్లడానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు.  తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్కులర్ ను సవాల్ చేస్తూ గోయల్ చేసిన అభ్యర్థనపై కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని కోర్టు అభిప్రాయపడింది. గోయల్ దుబాయ్ వెళ్తుండగా విమానం నుండి దింపేశారు. తనను విమానం నుండి  దింపిన తర్వాతే ఎల్ఓసీ  గురించి తెలిసిందని గోయల్ వెల్లడించారు.
 

click me!