భారతదేశంలో ఏ కరోనా వ్యాక్సిన్ మొదట వస్తుంది, ఎంత మందికి ఇవ్వబడుతుంది? నిపుణుల నుండి తెలుసుకోండి..

By S Ashok KumarFirst Published Dec 30, 2020, 11:17 AM IST
Highlights

శంలో కరోనా సంక్రమణ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత వారం రోజులుగా సంక్రమణ రేటు 2.25 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ త్వరలో ఆమోదించబడుతుందని అనే వార్తలు ప్రజలలో ఆశలు పెంచాయి.

భారతదేశంలో కరోనా వైరస్ సోకిన కేసులు రెండు కోట్లకు పైగా పెరిగాయి, మరణాల సంఖ్య కూడా ఒక లక్ష 48 వేలకు పైగా నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా సంక్రమణ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత వారం రోజులుగా సంక్రమణ రేటు 2.25 శాతంగా ఉందని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ త్వరలో ఆమోదించబడుతుందని అనే వార్తలు ప్రజలలో ఆశలు పెంచాయి. అయితే భారతదేశంలో ఏ టీకా మొదట వస్తుంది, మొదటి దశలో ఎంత మందికి వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది అనే అంచనాలు కూడా పెరిగాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

మొదటి దశలో ఎంత మందికి టీకాలు వేస్తారు?  

ఢీల్లీలోని మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ రాజేంద్ర కుమార్ ధమిజా మాట్లాడుతూ "మొదటి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో పోలీసులు, అంబులెన్స్ డ్రైవర్లు సహా ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్లు ఇవ్వబడతాయి. వారి సంఖ్య సుమారు రెండు కోట్లు. ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేస్తారు. వారి సంఖ్య సుమారు 27 కోట్లు. 

also read 

మన దేశంలో ఏ టీకా మొదట వస్తుంది? 

డాక్టర్ రాజేంద్ర కుమార్ ధమీజా వివరిస్తూ "మన దేశంలో మూడు వ్యాక్సిన్లు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. వాటిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్మిస్తున్న ఆక్స్ఫర్డ్ యొక్క కోవీషీల్డ్, ఆస్ట్రాజెనెకా అత్యవసర ఉపయోగం కోసం త్వరలో అనుమతి పొందవచ్చు. దీని ధర, నిల్వ లేదా లాజిస్టిక్స్ పరంగా భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా అనుకూలంగా ఉంటుంది. 

ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రిలో టీకా బృందంలో ఎవరు ఉంటారు ? 

డాక్టర్ రాజేంద్ర కుమార్ ధమిజా మాట్లాడుతూ, 'టీకా బృందంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇందులో చీఫ్ ఆఫీసర్ డాక్టర్, అతనితో పాటు ఒక నర్సు, మిగిలిన ముగ్గురు అతని సహాయకులుగా ఉంటారు. మొదటి వ్యక్తి ఇంజెక్షన్ ఇన్‌ఛార్జిగా, రెండవ వ్యక్తి టీకా నిల్వను పర్యవేక్షించడం. మూడవ వ్యక్తి సర్టిఫికెట్స్ తనిఖీ చేయడం అలాగే మిగిలిన ఇద్దరు వ్యక్తులు క్రౌడ్ మేనేజ్‌మెంట్‌ చూసుకుంటారు. 


ఆరోగ్య కేంద్రం సందర్శించడం ద్వారా ఎవరైనా వ్యాక్సిన్ పొందగలరా? 

డాక్టర్ రాజేంద్ర కుమార్ ధమిజా మాట్లాడుతూ, 'లేదు, టీకా బృందానికి జిల్లా యంత్రాంగం ఒక జాబితాను అందిస్తుంది, వారికి పేర్లతో ఉన్న జాబితాలో ఎవరికి ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో అందులో ఉంటుంది.  ఎవరి పేరు జాబితాలో ఉంటుందో ఆరోగ్య కేంద్రనికి వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వబడుతుంది. వారు ప్రభుత్వం గుర్తించిన ఫోటో ఐడి కార్డు తీసుకురావాలి. టీకా లబ్ధిదారుల జాబితాను జిల్లా యంత్రాంగం స్వయంగా తయారు చేస్తుంది.  

click me!