
బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డు సహాయంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ కార్డు. ఆధార్ కార్డ్‌లో వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఫోటోతో సహా అన్ని ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, పాన్ కార్డ్ సహా అన్ని ముఖ్యమైన పత్రాలకు ఆధార్ కార్డ్ లింక్ చేసి ఉంటుంది. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడం వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డును ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో కూడా తనిఖీ చేయవచ్చు. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు.
ఈ సదుపాయం యూజర్ ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేని వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండాలి. అయితే ఆధార్ కార్డును ఉపయోగించి బ్యాంక్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం.
మీ ఆధార్ కార్డ్ మీ బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోతే, ముందుగా ఆ పని చేయండి. తర్వాత క్రింది స్టెప్స్ అనుసరించండి..
>> మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99*99*1# డయల్ చేయండి.
>> UIDAI జారీ చేసిన 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని ఆటోమేటెడ్ కాలర్ మిమ్మల్ని అడుగుతాడు.
>> నిర్ధారణ కోసం మళ్లీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
>> దీని తర్వాత మీరు UIDAI నుండి ఫ్లాష్ SMS అందుకుంటారు. ఇది బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది.
ఆధార్ నంబర్‌ని ఉపయోగించి బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం చాలా ఈజీ పద్ధతి, ఇది ఎక్కడైనా చేయవచ్చు. అలాగే, ఖాతాలోని బ్యాలెన్స్‌ను చూసుకోవడానికి ఏటీఎం కార్డు లేదా బ్యాంకుకు వెళ్లడం అవసరం లేదు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు బ్యాంకు ఖాతా లేదా ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన తలనొప్పి తప్పుతుంది. ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ సౌకర్యం మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
UIDAI ఆధార్‌ని ఉపయోగించి చేయగలిగే అనేక సేవలను కూడా పరిచయం చేస్తుంది. డబ్బు బదిలీ కోసం ఇంటింటికీ సేవలను అందించడం , మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయడం ఇందులో ఉంది.