వాహనదారులకు కేంద్రం శుభవార్త : పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. దిగిరానున్న ధరలు

By Siva KodatiFirst Published May 21, 2022, 6:56 PM IST
Highlights

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రానున్నాయి. 
 

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి రానున్నాయి. అలాగే పీఎం ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ.200 సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ వర్తిస్తుందని పేర్కొంది. దేశంలో ఉజ్వల పథకం కింద 9 కోట్ల కనెక్షన్లు వున్నాయి. వీరందరికీ కేంద్రం నిర్ణయంతో లబ్ధి కలగనుంది. అలాగే దేశంలో సిమెంట్ ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. 

గతేడాది కూడా లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే. తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగినట్లయ్యింది. తాజాగా ఐరన్, స్టీల్‌పై కూడా కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పదార్ధాలపై దిగుమతి సుంకం తగ్గించింది మోడీ సర్కార్. 

click me!