ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాక్..వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే...

By Sandra Ashok KumarFirst Published Jun 16, 2020, 2:21 PM IST
Highlights

 నిత్యవసర వస్తువుల నుంచి పారిశ్రామిక సంస్థల దాకా అన్నీ తెరుచుకున్నాయి. కేంద్రం విధించిన లాక్ డౌన్ సమాయంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోతలు కూడా విధించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా వైరస్ పడగలు విప్పుతుంది. రోజురోజుకి మరింతగా పెరుగుతున్న కేసులు ప్రజలని ఆందోళనకు గురి చేస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపుతో ప్రజలు రోడ్లేక్కుతున్నారు. నిత్యవసర వస్తువుల నుంచి పారిశ్రామిక సంస్థల దాకా అన్నీ తెరుచుకున్నాయి.

కేంద్రం విధించిన లాక్ డౌన్ సమాయంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోతలు కూడా విధించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది.

దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది. దీంతో లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

2019 టూ  2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక పనితీరు అంచనా గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే ప్రభుత్వం ఈ గడువును డిసెంబర్ 2020 వరకూ మాత్రమే పొగిడిగించింది.

also read 

ఇప్పుడు వచ్చే ఏడాది మార్చి 31ను తాజా డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం మార్చి 31, 2021 వరకూ అంటే వచ్చే ఏడాది ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ పెంపుతో గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగులపై ఈ ఎఫెక్ట్ పడనుంది.

కేంద్రం జూన్ 11న విడుదల చేసిన ఆర్డర్ ప్రకారం ప్రస్తుతమున్న కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో  మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే ఇంక్రిమెంట్ల ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉండగా మే చివరి వరకూ ఈ ప్రక్రియ పూర్తి కానుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 43 వేల మార్క్ ను దాటింది. నిన్న ఒక్కరోజే 380 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాబారినపడి చనిపోయినవారి సంఖ్య 9,900కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 కేసలుు నమోదు అయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 3,43,091లకు చేరాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి 1,80,013 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

click me!