చందాకొచ్చర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారిపై వేటు

By sivanagaprasad KodatiFirst Published Jan 27, 2019, 5:08 PM IST
Highlights

వీడియోకాన్-ఐసీఐసీసీ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌‌, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారిపై వేటు పడింది. 

వీడియోకాన్-ఐసీఐసీసీ కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందాకొచ్చర్‌‌, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారిపై వేటు పడింది.

చందాకొచ్చర్ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి కమిటీ వీడియోకాన్‌కు ఆరు విడతలుగా రూ.1875 కోట్ల విలువైన రుణాన్ని మంజూరు చేసింది. ఆ తర్వాత రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుకు నష్టం వాటిల్లింది.

తన సంస్థకు రుణాలు మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్.. సూపర్ ఎనర్జీ పేరుతో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ చెందిన కంపెనీలో రూ. 64 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.

క్విడ్ ప్రో కో కింద అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై చందాకొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే వ్యవహారంలో చందాను బ్యాంక్ సీఈవో పదవి నుంచి తప్పిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తెలిపింది.

తాజాగా ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కోంటున్న చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ ధూత్‌లతో పాటు ఇతరులపై ఈ నెల 22న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసును పర్యవేక్షిస్తున్న సుధాన్ష్ ధార్ మిశ్రాను జార్ఖండ్‌లోని రాంచీకి బదిలీ చేస్తూ సీబీఐ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన సీబీఐలో బ్యాంకింగ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ సెల్‌లో ఎస్పీ హోదాలో ఉన్నారు. 

click me!