చందా కొచ్చర్‌కు షాక్: లుక్‌ అవుట్ నోటీసులు జారీ

By Siva KodatiFirst Published Feb 22, 2019, 10:40 AM IST
Highlights

వీడియోకాన్-ఐసీఐసీఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కుంభకోణంలో చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. 

వీడియోకాన్-ఐసీఐసీఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందా కొచ్చర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కుంభకోణంలో చందా కొచ్చర్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.

జాతీయ మీడియా కథనం ప్రకారం చందా కొచ్చర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా సీబీఐ అధికారులు ఎల్‌వోసీ నోటీసులు జారీ చేశారు.

ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తుండటంతో వారు దేశం విడిచి పారిపోనున్నరాననే అంచనాల నేపథ్యంలో సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ మేరకు సీబీఐ అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది.

తమ అనుమతి లేకుండా వీరు విమానాశ్రయాలను దాటిపోరాదని నోటీసుల్లో పేర్కొంది. 2012లో వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఎన్ శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్‌ని దోషిగా తేల్చింది.

బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. దీంతో ఆమెను ఇప్పటి వరకు సమర్థిస్తూ వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు పూర్తిగా ఆమోదించింది.

విధుల నుంచి తొలగించినట్లుగా పరిగణిస్తామని, అలాగే ఇంక్రిమెంట్లు, బోనస్‌లు, వైద్య చికిత్స పరమైన ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్స్ మొదలైనవి రద్దవుతాయని ప్రకటించింది. 

Last Updated Feb 22, 2019, 10:40 AM IST