కెనరా బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్లు చాలా లక్కీ: బ్యాంకు ఆఫర్ అదుర్స్ అంతే..

Published : Jun 01, 2025, 03:58 PM IST
canara bank

సారాంశం

కెనరా బ్యాంకు తన కస్టమర్లకు అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. ఈ ఆఫర్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఆ ఆఫర్ ఏంటి? ఎలాంటి లబ్ధి కలుగుతుంది? లాంటి వివరాలు తెలుసుకుందాం రండి. 

మనం ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశామనుకోండి అధికారులు ముందుగా చెప్పే విషయం ఏంటంటే.. కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్‌టెయిన్ చేయాలని, లేకపోతే ఫైన్ పడుతుందని హెచ్చరిస్తారు కదా.. కాని కెనరా బ్యాంకు తన ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అకౌంట్ హోల్డర్స్ ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్‌టెయిన్ చేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

ఎలాంటి అకౌంట్ హోల్డర్స్‌కి ఈ సౌకర్యం?

కస్టమర్లకు పెద్ద ఊరట కలిగిస్తూ కెనరా బ్యాంక్ ఇచ్చిన ఈ ప్రకటనతో చాలా మంది ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనతో సేవింగ్స్ అకౌంట్ ఉన్న వాళ్లు, విద్యార్థులు, NRI అకౌంట్స్ కలిగిన వారు ఇకపై మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదు. 

ఎప్పటి నుంచి ఇది అమలులోకి వస్తుంది?

ఇప్పటివరకు ఈ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన నిబంధన ఉంది. ఇప్పుడు ఆ నిబంధనను పూర్తిగా రద్దు చేసినట్టు బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయం జూన్ 1 నుంచి అమలులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

కెనరా బ్యాంక్ తీసుకున్న ఈ చర్య వల్ల చిన్న మొత్తాలు ఉండే ఖాతాదారులు మినిమం బ్యాలెన్స్ సమస్యతో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. బ్యాలెన్స్ తగ్గిన కారణంగా ఛార్జీలు విధించాల్సిన పరిస్థితి కూడా ఇకపై రాదని బ్యాంకు ప్రకటన ద్వారా తెలుస్తోంది. 

ఇప్పటివరకు రూ.2 వేలు లేకపోతే ఫైన్ వేసేవారు..

ఇప్పటి వరకు మినిమం బ్యాలెన్స్ కంటే తక్కువ నగదు ఉన్న ఖాతాదారులపై వివిధ రకాల ఛార్జీలు విధించేవారు. ఉదాహరణకు అర్బన్ బ్రాంచ్‌లలో మినిమం బ్యాలెన్స్ రూ.2,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.1,000, రూరల్ బ్రాంచ్‌లలో రూ.500 ఉండాల్సి ఉండేది. ఈ నియమాన్ని అమలు చేయని ఖాతాదారులపై బ్యాంకులు ఛార్జీలు విధించేవి.

కానీ ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యం లభించినట్లవుతుంది. దీనివల్ల చిన్న మొత్తాలు ఉండే ఖాతాదారులు కూడా ఖర్చుల భయంలేకుండా ఖాతాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

కొత్తగా అకౌంట్ తీసుకొనే వారికి ఈ రూల్ వర్తిస్తుందా?  

ఈ నిర్ణయం ఇప్పటికే ఖాతాలు కలిగి ఉన్నవారికే కాకుండా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయదలచుకున్న వారికి కూడా ఉపయోగపడనుంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఇలా చాలా విభాగాల వారికి ఇది ఉపయోగంగా మారనుంది.

కనుక, కెనరా బ్యాంక్ ఖాతాదారులు ఇకపై మినిమం బ్యాలెన్స్ మంటూ భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంక్ కొత్త పాలసీ ప్రకారం ఖాతాలో ఎంత మొత్తమున్నా ఛార్జీలు విధించబోమని స్పష్టంచేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Insurance Scheme: రోజుకు 2 రూపాయ‌ల‌తో రూ. 2 ల‌క్ష‌లు పొందొచ్చు.. వెంట‌నే అప్లై చేసుకోండి
మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు