Business Ideas: ప్రధాని మోదీ అందించే ముద్రా రుణంతో ఈ వ్యాపారం చేస్తే ఉన్న ఊరిలోనే నెలకు రూ. 1 లక్ష ఆదాయం పక్కా

By Krishna AdithyaFirst Published Aug 5, 2022, 7:14 PM IST
Highlights

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఏళ్లు గడిచినా జీతం పెరగడం లేదా...అయితే ఇక మీరు  స్వంత వ్యాపారంతోనే జీవితంలో ముందడుగు వేయడం ప్రారంభించండి. తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని అందించే అనేక వ్యాపారాలు ఉన్నాయి. అందులో ఆయిల్ మిల్లు యూనిట్ ఒకటి.

వంటనూనె అనేది నిత్యవసర వస్తువు, ఇందులో అనేక రకాలు ఉంటాయి. అత్యధికంగా సన్ ఫ్లవర్, వేరుశనగ, ఆయిల్ పామ్ నూనె ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్స్ వ్యాపారం కూడా అన్ని నగరాలు, పట్టణాల్లో విస్తరించింది. దీంతో వివిధ రకాల నూనెలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారం మన దేశంలో చాలా విజయవంతంగా నడుస్తోంది. మీరు కూడా వంటనూనె అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించి వ్యాపారిగా మారవచ్చు. అయితే, ఆయిల్ మిల్లును తెరిచే ముందు, మిల్లును ఎలా తెరిచారు మరియు ఏ రకమైన విత్తనాల నుండి నూనె తీయబడుతుందో మీరు బాగా తెలుసుకోవాలి.

వంటనూనెకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దేశంలో ఆయిల్ దిగుమతి తగ్గిపోయింది. అటు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగడం లేదు. దీంతో దేశీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ ఆయిల్ మిల్లు యూనిట్ ఏర్పాటు చేస్తే మంచి ఆదాయం వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో లభించే ఆయిల్స్ లో చాలా వరకూ రసాయనాలు కలిపి అమ్ముతున్నట్లు పలు నివేదికలు బయటపెడుతున్నాయి. అయితే పాత పద్ధతిలో కోల్డ్ ప్రెస్, వుడెన్ ప్రెస్ ఆయిల్స్ అంటే గానుగ నూనెలకు మంచి డిమాండ్ ఉంది. 

మీరు నివసించచేంది గ్రామం, పట్టణం లేదా నగరం అయినా పర్లేదు. ఈ వ్యాపారం ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీరు విజయవంతం కావచ్చు. ఇంతకు ముందు గానుగ ఏర్పాటుకు అవసరమైన యంత్రాలను ఉపయోగించాల్సి ఉంది. ప్రస్తుతం పోర్టబుల్ మెషీన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ తయారీ యంత్రాలు మార్కెట్‌లో తక్కువ ధరకే లభిస్తున్నాయి.

ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషిన్ 2 లక్షల రూపాయలలో వస్తుంది. మీరు ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. ఒక ఆయిల్ మిల్లు పూర్తి సెటప్ కోసం పెట్టుబడి దాదాపు 3-4 లక్షల రూపాయలు కావాలి. ఈ ఆయిల్ యూనిట్ ప్రారంభించిన తొలినాళ్లలో కాస్త కష్టపడాల్సి వస్తుంది.

మీరు నాణ్యమైన ఉత్పత్తులను వేరుశనగ, నువ్వులు, అవిసెలు, సన్ ఫ్లవర్, కుసుమలు వంటి గింజలతో నూనెను సేకరిస్తే, మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీరు తినే నూనె ఏదైనా నాణ్యమైనదిగా ఉండాలి. అప్పుడే మీరు రెగ్యులర్  కస్టమర్లను పొందుతారు. తద్వారా డిమాండ్ పెరుగుతుంది. వెలికితీసిన నూనెను స్థానికంగా విక్రయించవచ్చు. రిటైల్ విక్రయాలకు సొంత కౌంటర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కిరాణా దుకాణాలతో టై అప్, వాటి ద్వారా కూడా అమ్మవచ్చు. లేదా.. ఆన్‌లైన్ మార్కెటింగ్ సహాయం కూడా తీసుకోవచ్చు. 

అలాగే నూనె తీసిన తర్వాత పిప్పి పశువుల పెంపకందారులకు అవసరమైన దాణాగా కూడా విక్రయించుకోవచ్చు. కాబట్టి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మీ మిల్లు బాగా నడిస్తే, మీరు మీ మొత్తం పెట్టుబడిని ఒక సంవత్సరంలోపు తిరిగి పొందుతారు.
 

click me!