Business Ideas: ఇదేం బిజినెస్ అని చీప్ గా చూడకండి..గ్రామంలో ఉండి నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించే చాన్స్..

By Krishna AdithyaFirst Published May 5, 2023, 6:36 PM IST
Highlights

గ్రామీణ యువత వ్యాపారం కోసం ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఓ చక్కటి వ్యాపార అవకాశం ద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఉన్న గ్రామంలోనే ప్రతి నెల ఆదాయం పొందే వీలుంది. 

మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే, ఆ భూమిలో కూరగాయల సాగు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. నిజానికి కూరగాయల సాగులో పెద్దగా లాభం ఉండదని అంటూ ఉంటారు.  కానీ సరైన మార్కెటింగ్ ప్లాన్ చేసుకుంటే కూరగాయల ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా క్యాబేజీ పంట వేయడం ద్వారా మీరు మంచి బిజినెస్ పొందే వీలుంది. క్యాబేజీ ఎవరు తింటారులే దీని పెద్దగా తిన ఉపయోగించరు కదా, అని మీరు పెదవి విరవడం ఖాయం. 

నిజానికి క్యాబేజీకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.  క్యాబేజీని ఎక్కువగా చైనీస్ రెస్టారెంట్ల వాళ్ళు వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఇవి వీధుల్లో మనకు తరచుగా కనపడే నూడిల్స్ దుకాణాల వారు కూడా క్యాబేజీని విరివిగా వినియోగిస్తూ ఉంటారు.  అందుకే క్యాబేజీకి సీజన్ తో సంబంధం లేకుండా నిరంతరం డిమాండ్ ఉంటుంది. మీరు కనుక క్యాబేజీ పంటలు వేసినట్లయితే సీజన్ తో సంబంధం లేకుండా నిరంతరం ఆదాయం పొందే అవకాశం ఉంది. 

మీ వద్ద ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉన్నట్లయితే క్యాబేజీ పంటను చక్కగా వేసుకోవచ్చు. అయితే నీటి పారుదల వసతి ఉన్నవారికి క్యాబేజీ సాగు ఎక్కువగా లభిస్తుంది. క్యాబేజీ సాగుకు నల్లరేగడి భూములయితే చక్కగా ఉపయోగపడతాయి. అదే విధంగా అన్ని రకాల నీళ్లలోనూ క్యాబేజీ పండుతుంది.

క్యాబేజీ విత్తనాలను తెచ్చి విత్తుకోవడం ద్వారా మీరు ఈ పంటను పండించవచ్చు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో కూడా మీరు క్యాబేజీ పంటను పండించవచ్చు. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని  కాలాల్లో క్యాబేజీ పంట పండించవచ్చు. అలాగే క్యాబేజీ పంట ఎక్కువగా,  చలికాలంలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. 

క్యాబేజీ పంట మార్కెటింగ్ విషయానికి వస్తే మీకు సమీపంలో నగరాలు లేదా పట్టణాలు ఉన్నట్లయితే అక్కడ వ్యవసాయ మార్కెట్లలో విక్రయించవచ్చు లేదా.  మీకు తెలిసిన వ్యాపారులకు కూడా విక్రయించవచ్చు.  అయితే నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా మీకు మంచి డిమాండ్ లభిస్తుంది.  ఇందుకోసం మీరు కొద్దిగా రీసెర్చ్ వర్క్ చేయాలి.  మీ సమీపంలో ఉన్నటువంటి నూడిల్స్ వ్యాపారస్తులు అదే విధంగా రెస్టారెంట్లు హోటల్స్ వారికి ప్రతిరోజు ఎంత క్యాబేజీ  అవసరం ఉందో తెలుసుకోవాలి.  అనంతరం వారి డిమాండ్ కు తగ్గట్టుగా మీరు మార్కెట్ కన్నా తక్కువ ధరకే క్యాబేజీ సప్లై చేసినట్లయితే మీకు నిరంతరం ఆర్డర్లు వస్తూనే ఉంటాయి.  తద్వారా మీరు ప్రతి నెల ఒక లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.  

click me!