Budget 2020: గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పథకం

By telugu teamFirst Published Feb 1, 2020, 12:39 PM IST
Highlights

ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం చేస్తామన్నారు. గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు. నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తామని చెప్పారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో  ఆమె రైతులకు, గ్రామీణ మహిళలకు పెద్దీపీట వేశారు. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ స్కీమ్ ప్రవేశపెట్టారు.

ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం చేస్తామన్నారు. గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు. నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తామని చెప్పారు.

ఇక ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కూడా పెద్ద పీట వేశారు. రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇస్తామని చెప్పారు.  వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు  చెప్పారు.  పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. 
ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు,  స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ఆమె వివరించారు.

కాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది.

click me!