చోక్సీ వైద్య పరీక్షల నివేదిక సమర్పించాలి: బాంబే హైకోర్టు ఆదేశం

By rajesh yFirst Published Jun 25, 2019, 1:31 PM IST
Highlights


పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చోక్సీని ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ఆయన తరఫు న్యాయవాదిని బాంబే హైకోర్టు ఆదేశించింది. దాన్ని జేజే దవాఖాన వైద్యులు పరిశీలించిన తర్వాత చోక్సీని భారతదేశానికి తరలించాలా? వద్దా? అన్న విషయమై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

ముంబై: తన ఆరోగ్య పరిస్థితిపై వెంటనే మెడికల్ ప్రతాలను సమర్పించాలని  పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సిని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. పరిశీలన నిమిత్తం ఆ పత్రాలను ముంబైలోని జేజే ఆసుప్రతికి సమర్పించాలని, దాన్ని బట్టి  అతడు ప్రయాణం చేయవచ్చో లేదో తేలుస్తామని వెల్లడించింది. 

ఛోక్సి భారత్‌కు రావడానికి ప్రయాణం చేయొచ్చో లేదో, ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జేజే ఆసుపత్రి వైద్య బృందం పరిశీలిస్తారని హైకోర్టు తెలిపింది. ఆ తరవాత ఆ పత్రాలను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం కరీబియన్‌ దీవుల్లోని అంటిగ్వా దేశంలో ఆశ్రయం పొందిన మెహుల్ ఛోక్సిని తేవడానికి ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని శనివారం ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల పదో తేదీకి వాయిదా వేసింది. 

ఈడీ వాదనలు విన్న తరవాత కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయ విచారణను ఆలస్యం చేయడానికి ఛోక్సి ఆరోగ్య కారణాలను వంకగా చూపిస్తూ, కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఈడీ పేర్కొన్నది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కి వేల కోట్ల రూపాయలు మోసం చేసిన వజ్రాల వ్యాపారీ నీరవ్ మోదీకి మెహుల్ ఛోక్సి మేనమామ. 

ఇదిలా ఉంటే రెడ్ కార్నర్ నోటీసు వల్ల వైద్య చికిత్స కోసం మియామీకి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉన్నదని మెహుల్ చోక్సీ తరఫు న్యాయవాది వాదించారు. ఈ రెడ్ కార్నర్ నోటీసును ఉపసంహరించాలని కోరారు. తనపై పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడన్న ముద్ర తొలిగించి వేయాలని అభ్యర్థించారు. మెహుల్ చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ కలిసి పీఎన్బీని రూ.13,400 కోట్లకు మోసగించిన సంగతి తెలిసిందే. 

మెహుల్ చోక్సీ కేసులును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ (ఎస్ఎఫ్ఐఓ), సీబీఐ, డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఆదాయం పన్ను (ఐటీ) శాఖలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే మెహుల్ చోక్సీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
 

click me!