బ్లింకిట్ యాప్‌లో పేరెంటల్ కంట్రోల్స్.. ఈ కొత్త అప్‌డేట్ ఎలా పనిచేస్తుంది?

Published : Aug 19, 2025, 08:30 PM IST
Blinkit

సారాంశం

Blinkit Parental Control Feature: ప్రముఖ డెలివరీ యాప్ బ్లింకిట్ తమ యాప్‌లో ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్స్ అందుబాటులోకి తెచ్చింది. సున్నితమైన ఉత్పత్తులను పిన్ సెట్ చేసుకుని పిల్లలకు కనిపించకుండా దాచుకునే అవకాశం తీసుకొచ్చింది.

Blinkit Parental Control Feature: క్విక్-కామర్స్ సేవలందించే బ్లింకిట్ యాప్ ఇప్పుడు వినియోగదారులకు కొత్త పేరెంటల్ కంట్రోల్స్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ప్రొఫైల్‌లోకి వెళ్లి పిన్ సెట్ చేసుకుని సున్నితమైన ఉత్పత్తులను కనిపించకుండా చేయవచ్చు. ఒకవేళ పిన్ మర్చిపోతే రికవరీ కోసం ఒక ఫోన్ నంబర్ సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ ఇంట్లో పిల్లలు బ్లింకిట్ యాప్‌ని వాడినా, పెద్దలకు మాత్రమే సంబంధించిన ఉత్పత్తులు వారికి కనిపించవు.

బ్లింకిట్ యాప్ పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

1. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో యాక్టివేషన్ - యూజర్లు తమ ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి.

2. PIN సెట్ చేయడం - వినియోగదారులు తమ పిన్ సెట్ చేయడంతో ఇది సున్నితమైన ఉత్పత్తులకు యాక్సెస్ చేయడానికి కీగా పనిచేస్తుంది.

3. సున్నితమైన ఉత్పత్తులను దాచడం - పిన్ సెట్ చేసిన తర్వాత, బ్లింకిట్ గుర్తించిన సున్నితమైన లేదా వయస్సుకు అనుకూలం కాని ఉత్పత్తులు సాధారణ బ్రౌజింగ్‌లో కనిపించవు. వాటిని చూడాలంటే లేదా కొనాలంటే ముందుగా పిన్ ఎంటర్ చేయాలి.

4. రికవరీ ఫోన్ నంబర్ - వినియోగదారులు పిన్ మర్చిపోతే తిరిగి యాక్సెస్ పొందడానికి రికవరీ ఫోన్ నంబర్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

తల్లిదండ్రుల ఆందోళనల మధ్య బ్లింకిట్ కొత్త ఫీచర్

తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ ఆధారంగా బ్లింకిట్ యాప్ పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ ను తీసుకొచ్చింది. చాలా కుటుంబాలు బ్లింకిట్ యాప్ ద్వారా ప్రతిరోజు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తుండగా, పిల్లలు కూడా యాప్ వాడే పరిస్థితులు ఉన్నాయి. అయితే, చాక్లెట్లు లేదా టాయ్స్ చూస్తూ ఉండగా పెద్దలకు సంబంధించిన కండోమ్స్ లాంటివి కనిపించడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది.

బ్లింకిట్ యాప్ పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ పై దీపిందర్ గోయల్ ఏమన్నారంటే?

ఈ సమస్యపై దీపిందర్ గోయల్ కూడా స్పందించారు. ఆయన దీన్ని “చాలా వ్యక్తిగతమైన, ముఖ్యమైన అంశం”గా పేర్కొన్నారు. అలాగే పిల్లలకు అనవసరంగా వయోజన ఉత్పత్తులు కనిపించకుండా చేయడానికి ప్రత్యేక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉందని అంగీకరించారు. ఈ క్రమంలోనే బ్లింకిట్ యాప్ పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ ను తీసుకొచ్చారు.

బ్లింకిట్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ కచ్చితంగా వినియోగదారులను రక్షించే దిశగా అడుగుగా చెప్పవచ్చు. బ్లింకిట్ ఈ కొత్త చర్యతో కుటుంబ వినియోగదారుల కోసం యాప్‌ను మరింత సురక్షితంగా మార్చింది. ఇకపై తల్లిదండ్రులు పిన్ సిస్టమ్ ద్వారా పిల్లల యాక్సెస్‌ను నియంత్రించవచ్చు. భవిష్యత్తులో మరింత సులభమైన యూజర్ ఇంటర్‌ఫేస్, విద్యా సంబంధిత సమాచారం యాప్‌లోకి రానున్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?