పక్కపక్కనే కూర్చొని 31 రూపాయల ఓఆర్ఎస్ తాగిన కోటీశ్వరులు.. నెటిజన్లు ఫిదా..

By Ashok kumar Sandra  |  First Published Jun 11, 2024, 10:47 PM IST

అంబానీ, షారుక్ ఖాన్ ఇంకా ఇతర ధనవంతులు తాగే నీరు చాలా ఖరీదైనది. ఇప్పుడు ఈ బిలియనీర్లు ముఖేష్ అంబానీ,  షారూఖ్ ఖాన్ పక్కపక్కనే కూర్చుని రూ.31 ఓఆర్ఎస్ తాగుతు కనిపించారు.
 


న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ, నీతా అంబానీ  మరికొంత మంది  ధనవంతులు సహా పలువురు ప్రముఖులు ఖరీదైన నీటిని తాగుతుంటారు. ఆహారం, నీరు ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైనవి. అయితే మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన  ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పక్కనే కూర్చున్నారు. అంతే కాదు కేవలం 31 రూపాయల ఓఆర్ఎస్ తాగుతూ కనిపించారు. 

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల లిస్టులో ముఖేష్ అంబానీ ఉండగా, షారుక్ ఖాన్ అత్యంత సంపన్న సెలబ్రిటీల లిస్టులో  గుర్తింపు పొందారు. వీరిద్దరూ 31 రూపాయల ఓఆర్‌ఎస్‌ తాగడం ఇప్పుడు పలువురి దృష్టిలో పడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు సామాన్యుల లాగానే  అంబానీ-షారూక్ ఖాన్ ఓఆర్ఎస్ తాగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

Latest Videos

నేటి యుగంలో చాలా ఖరీదైన పానీయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కోటీశ్వరులు 31 రూపాయల ఓఆర్ఎస్ తాగుతూ కెమెరాకి చిక్కారు. ఢిల్లీలో మండుతున్న ఎండకి డీహైడ్రేషన్‌, అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఓఆర్‌ఎస్‌ అందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆహ్వానితులైన ప్రముఖులకు ఈ ఆకస్మిక వాతావరణం తట్టుకోవడం   కష్టం కాబట్టి అందరికీ ఈ ORS అందించారు.

ముఖేష్ అంబానీ, షారుక్ ఖాన్ చాలా సార్లు చాలా సాదా సీదా  కనిపించారు. మరీ ముఖ్యంగా ముఖేష్ అంబానీ ఇటీవల తన గుర్తింపు కార్డును సాధారణ తరహాలో ప్లాస్టిక్ కవర్‌లో తీసుకొచ్చి ఓటు వేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. వ్యాపారవేత్తలతో సహా పలువురిని ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో నరేంద్ర మోదీ తాజాగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీతో పాటు 72 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో కర్ణాటక నుంచి మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, ప్రహ్లాద్ జోషి, శోభా కరంద్లాజే, వీ సోమన్న కూడా ఉన్నారు. 

 

HQ pictures of Shah Rukh Khan & Mukesh Ambani at Rashtrapati Bhavan earlier today for PM Narendra Modi's Oath Ceremony ♥️ pic.twitter.com/HlUE9lV7PU

— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors)
click me!