
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే (Bharatpe)ఎండీ, డైరెక్టర్ పదవులకు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో అతని భార్య మాధురీ జైన్ హెడ్ ఆఫ్ కంట్రోల్ పదవి నుండి తొలగించినట్లు వార్తలు వచ్చాయి.
బోర్డుకు తన రాజీనామా లేఖలో, గ్రోవర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా అన్నాడు, "నేను వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీకి నేను బలవంతంగా వీడ్కోలు పలుకుతున్నందున ఇది చాలా బాధగా ఉంది. నేడు ఈ కంపెనీ ఫిన్‌టెక్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోంది. 2022 ప్రారంభం నుండి, దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు నా ప్రతిష్టను మాత్రమే కాకుండా కంపెనీ ప్రతిష్టను కూడా దెబ్బతీసేందుకు ఎటువంటి ఆధారం లేకుండా నన్ను, నా కుటుంబాన్ని ఇరికించారు. వారి నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను." అని తెలిపారు.
గ్రోవర్స్ గవర్నెన్స్ రివ్యూను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత..
ఫిబ్రవరి 27న, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (SIAC) కంపెనీ నిర్వహణపై సమీక్ష నిర్వహించాలన్న BharatPe కోఫౌండర్ అష్నీర్ గ్రోవర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అత్యవసర మధ్యవర్తిత్వ అభ్యర్థనను తిరస్కరించిందనే వార్తలు వచ్చాయి. గ్రోవర్ బోర్డు సమీక్షను ప్రారంభించడం వెనుక కంపెనీ బోర్డుకు ఉద్దేశాన్ని ప్రశ్నించారు. అల్వారెజ్ & మార్సల్ నిర్వహించిన ఆడిట్ సగమే పూర్తయినప్పటికీ నివేదికలను మీడియాకు లీక్ చేయడం వెనుక ఉన్న దురుద్దేశాలను కూడా గ్రోవర్ తన లేఖలో ప్రశ్నల రూపంలో లేవనెత్తాడు.
గ్రోవర్ తన రాజీనామాలో ఏమి రాశారు...
తన రాజీనామా లేఖలో, గ్రోవర్ ఇలా వ్రాశారు, "భారతీయ స్టార్టప్ వ్యవస్థ దేశ యువతకు వారి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. నాలాంటి వారు వారికి ప్రేరణగా నిలిచాము, కానీ నేను ఇప్పుడు మా వాటాదారులు, అలాగే కొందరు కుట్రదారులతో కంపెనీ నిర్వహణ కోసం పోరాడుతూ నా సమయాన్ని వృధా చేస్తున్నాను. దురదృష్టవశాత్తూ ఈ పోరాటంలో, మేనేజ్‌మెంట్ నిజంగా ఆపదలోకి జారుకుందని తెలిపారు.
నాతో పాటు నా టీం మేట్స్ కృషి తో, కంపెనీ ఏటా రూ. 1,00,000 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపి, రూ. 4,000 కోట్ల కంటే ఎక్కువ రుణాలను అందించడంతో పాటు, 1 కోటి మంది చిరు వ్యాపారవేత్తలు, దుకాణదారుల నెట్‌వర్క్‌ను సృష్టించింది. రుణాలు. వ్యవస్థీకృత ఇ-కామర్స్, కోవిడ్‌తో పోరాడటానికి లక్షలాది చిరు వ్యాపారాలకు BharatPe రుణాలు అందించడం ద్వారా సహాయపడిందని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే, జనవరి 28న, భారత్‌పే సంస్థ మేనేజ్ మెంట్ పై సమీక్ష నిర్వహించేందుకు అల్వారెజ్‌ను నియమించినట్లు వెల్లడించిన విషయం విదితమే.