నమ్మబుద్ధి కావడం లేదా.. రూ. 20 వేల లోపే One Plus నుంచి 5G ఫోన్ విడుదలకు సిద్ధం అవుతోంది...

By Krishna AdithyaFirst Published May 28, 2023, 1:05 AM IST
Highlights

ప్రస్తుత కాలంలో 5G ఫోన్ కొనేందుకే జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటికే మొబైల్ ఆపరేటర్లు చాలావరకు 5జి నెట్వర్క్ ను ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ గా  డేటాను పొందడానికి అలాగే వేగంగా పనిచేయడానికి ఫైవ్ జి ఫోన్ అనేది అత్యవసరంగా మారింది. 

 

మీరు మంచి ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా…అయితే వన్ ప్లస్ సంస్థ నుంచి చక్కటి 5జీ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువ ధరలోనే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం

ఒక మంచి 5జి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇక ఏ మాత్రం ఆలోచించకండి.  OnePlus Nord N30 5G ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు త్వరలోనే సిద్ధం అవుతోంది.. ఈ ఫోన్ ఇప్పటికే అటు రివ్యూయర్ల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందుతోంది. 

OnePlus Nord N30 5Gలో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇవ్వనున్నారు. ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ఈ పరికరం సింగిల్-కోర్ , మల్టీ-కోర్ పరీక్షలలో వరుసగా 888, 2076 పాయింట్లను స్కోర్ చేసింది. దీని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే OnePlus Nord CE 3 Lite 5Gని పోలి ఉంటాయి.

OnePlus Nord N30 5Gలో IPS LCD డిస్ ప్లేతో వస్తోంది.  ఇది పూర్తి HD ప్లస్ రిజల్యూషన్ . అలాగే 120 Hz రిఫ్రెష్ రేటింగ్ తో వస్తుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వవచ్చు. ప్రధాన సెన్సార్ 108 మెగాపిక్సెల్స్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది 67W SuperWook ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది ముందు భాగంలో 16 MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చని భావిస్తున్నారు.

OnePlus Nord CE 3 Lite 5G గురించి మాట్లాడుకుంటే,ఇది 6.72-అంగుళాల పూర్తి-HD + (1,080x2,400 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌లో కూడా పనిచేస్తుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన సెన్సార్ 108-మెగాపిక్సెల్ Samsung HM6 సెన్సార్. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.  ఇది 67W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ బరువు 195 గ్రాములుగా ఉంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర రూ. 19,999గా వీలుంది. ఈ ఫోన్ జూలై నెలలోనే భారత మార్కెట్లోకి విడుదల కానుంది. 
 

click me!