
మే నెలలో బ్యాంకులకు రాబోయే సెలవులను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరుపుకొనే పండగలు, ఇతర వేడుకల ఆధారంగా బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందించింది. మొత్తం 13 సెలవులు బ్యాంకులకు రానున్నాయి. ఆదివారాలను కూడా కలుపుకొని మొత్తంగా 13 బ్యాంక్ హాలిడేలు రానున్నాయి. మే 1వ తేదీ కార్మిక దినోత్సవం ఆదివారంలో కలిసిపోయింది.
సాధారణంగా బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. స్టేట్-స్పెసిఫిక్ హాలిడే, రిలీజియస్ హాలిడే, ఇతర పండగలు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ మతపరమైన సెలవులు వస్తుంటాయి. దీనికి ప్రత్యేకంగా తేదీ అనేది ఉండదు. ఇలాంటివన్నీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మంజూరు అవుతాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. మే 1: కార్మిక దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే రోజు మహారాష్ట్ర రాష్ట్ర దినోత్సవం.
మే 2వ తేదీన మహర్షి పరశురామ జయంతి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 3వ తేదీన ఈద్-ఉల్-ఫితర్ దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే రోజు బసవ జయంతి సందర్భంగా కర్ణాటకలో మాత్రమే బ్యాంకులు పని చేయవు. ఈ హాలిడే ఈద్-ఉల్-ఫితర్‌లో కలిసింది. మే 4వ తేదీన తెలంగాణలో ఈద్-ఉల్-ఫితర్ సెలవు ఉంటుంది. మే 8వ తేదీన ఆదివారం హాలిడే. మే 9వ తేదీన రవీంద్రనాథ్ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో బ్యాంకులకు సెలవు.
మే 14వ తేదీన రెండవ శనివారం కావడం వల్ల బ్యాంకులు పని చేయవు. మే 22వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. మే 16వ తేదీన మెర్క్యురీ పౌర్ణమి/బుద్ధ పూర్ణిమ కారణంగా బ్యాంకులకు సెలవును ప్రకటించింది ఆర్బీఐ. మే 22వ తేదీన ఆదివారం సెలవు. మే 24న ఖాజీ నజ్రుల్ ఇస్మాయిల్ జయంతి సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు. మే 28వ తేదీన 4వ శనివారం, మే 29న ఆదివారం సెలవు ఉంటుంది.
మే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా
2022 మే 1 : కార్మిక దినోత్సవం / మహారాష్ట్ర రాష్ట్ర దినోత్సవం. ఇదే రోజున ఆదివారం కావడం వల్ల కూడా సెలవుగా ఉంటుంది.
2022 మే 2 : మహర్షి పరశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)
2022 మే 3 : ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)
2022 మే 4 : ఈద్-ఉల్-ఫితర్, (తెలంగాణ)
2022 మే 8 : ఆదివారం (వారాంతపు సెలవు)
2022 మే 9 : గురు రవీంద్రనాథ్ జయంతి - పశ్చిమ బెంగాల్, త్రిపుర
2022 మే 14 : రెండవ శనివారం బ్యాంకులకు సెలవు
2022 మే 22 : ఆదివారం (వారాంతపు సెలవు)
2022 మే 16 : మెర్క్యురీ పౌర్ణమి
2022 మే 22 : ఆదివారం (వారాంతపు సెలవు)
2022 మే 24 : కాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు - సిక్కిం
2022 మే 28 : 4వ శనివారం బ్యాంకులకు సెలవు
2022 మే 29 : ఆదివారం (వారాంతపు సెలవు)
ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.