Bank Holidays in December 2021: డిసెంబర్‌లో 12 రోజులు బ్యాంక్‌లకు సెలవులు.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి..

Published : Nov 25, 2021, 11:31 AM ISTUpdated : Nov 25, 2021, 11:54 AM IST
Bank Holidays in December 2021: డిసెంబర్‌లో 12 రోజులు బ్యాంక్‌లకు సెలవులు.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి..

సారాంశం

ఏదైనా ముఖ్యమైన పని మీద బ్యాంక్‌కు (Bank) వెళ్తున్నారా..?, రెగ్యులర్‌గా బ్యాంక్ ద్వారా లావాదేవీలు సాగిస్తుంటురా..? అయితే ఈ వార్త మీ కోసమే. 2021 డిసెంబర్‌లో(December 2021) బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

ఏదైనా ముఖ్యమైన పని మీద బ్యాంక్‌కు (Bank) వెళ్తున్నారా..?, రెగ్యులర్‌గా బ్యాంక్ ద్వారా లావాదేవీలు సాగిస్తుంటురా..? అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే వచ్చే నెల డిసెంబర్‌లో  బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు (Bank Holidays in December 2021) ఉంటాయో తెలుసుకోండి. 2021 డిసెంబర్‌లో(December 2021)  వివిధ నగరాల్లో బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని ఈ హాలిడేస్ జాబితా ఉంటుంది. అయితే స్పెషల్ హాలిడేస్ మాత్రం ప్రాంతానికి ప్రాంతానికి మారుతు ఉంటాయనే సంగతి గుర్తుంచుకోవాలి. ఇక, ప్రతి నెలలో వచ్చే ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం రోజున కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఇవన్నీ కలుపుకుంటే.. డిసెంబర్‌లో మొత్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ 12 రోజులలో..  6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6  సెలవులు ఆయా ప్రాంతాల్లో స్పెషల్ హాలిడేస్ ఆధారంగా ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎలాంటి పండగలు లేవు కనుక.. 6 రోజులు సాధారణ సెలవులు మాత్రమే ఉండనున్నాయి. 

మరి డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలీడేస్‌ను ఒకసారి చూద్దాం..
డిసెంబర్ 3.. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా పనాజీలో బ్యాంకులు మూసివేయబడతాయి.
డిసెంబర్ 5 - ఆదివారం (సెలవు)
డిసెంబర్ 11- శనివారం (నెలలో రెండవ శనివారం)
డిసెంబర్ 12- ఆదివారం (సెలవు)
డిసెంబర్ 18- యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)
డిసెంబర్ 19- ఆదివారం (సెలవు)
డిసెంబర్ 24- క్రిస్మస్ పండుగ (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
డిసెంబర్ 25- క్రిస్మస్ పండుగ, శనివారం(నెలలో నాల్గవ శనివారం)
డిసెంబర్ 26- ఆదివారం (సెలవు)
డిసెంబర్ 27- క్రిస్మస్ వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)
డిసెంబర్ 30- యు కియాంగ్ నోంగ్‌బా (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)
డిసెంబర్ 31- నూతన సంవత్సర వేడుక (ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.)

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!