
భారత్ NCAP (Bharat New Car Assessment Program) టెస్ట్‌లో మారుతి సుజుకి బలేనో హ్యాచ్‌బ్యాక్ కారును ఇటీవల టెస్ట్ చేశారు. ఈ రిజల్ట్స్ కారు ఎంత సేఫ్టీయో తెలియజేశాయి. ఈ సమాచారం బలేనో కొనుక్కోవాలనుకొనే వారికి చాలా ఉపయోగపడుతుంది. క్రాష్ టెస్ట్ ఫలితాలు ఎలా వచ్చాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి నుంచి వచ్చిన బలేనో 2015లో మొదటి సారి మార్కెట్ లోకి వచ్చింది.బేసిక్ మోడల్ ధర రూ.6.70 కాగా, టాప్ మోడల్ ఆల్ఫా AMT మోడల్ ధర రూ.9.92 లక్షలు గా ఉంది. 2015 తర్వాత ధరల్లో మార్పుతో పాటు సేఫ్టీ ఫీచర్లు పెంచుతూ కొన్ని అప్ డేట్స్ తో హ్యాచ్ బ్యాక్స్ వచ్చాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వ సూచనలతో 6 ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ తో బలేనో మోడల్స్ మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలుస్తున్నాయి.
6 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న బలేనో మోడల్ పెద్దల సేఫ్టీలో 32 పాయింట్లకి 26.52 పాయింట్లు తెచ్చుకుని 4 స్టార్లు అందుకుంది. ఇందులోనే 2 ఎయిర్‌బ్యాగ్స్ మోడల్ అయితే 24.04 పాయింట్లతో కొంచెం తక్కువగా స్కోర్ చేసింది. అయితే పిల్లల సేఫ్టీలో ఈ రెండు మోడల్స్ కూడా 49 పాయింట్లకి 34.81 పాయింట్లు తెచ్చుకుని 3 స్టార్లు సాధించాయి. ఈ రెండు మోడల్స్ లోనూ ISOFIX మౌంట్ ఉన్న బ్యాక్ సీట్లు ఉన్నాయి.
కారు ముందు భాగం ఎంత డ్యామేజ్ అవుతుందో చూసే టెస్ట్‌లో 6, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న రెండు మోడల్స్ కూడా 16 పాయింట్లకి 11.54 పాయింట్లు తెచ్చుకున్నాయి. కానీ సైడ్ టెస్ట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్ మోడల్ 12.50 పాయింట్లు, 2 ఎయిర్‌బ్యాగ్స్ మోడల్ 14.99 పాయింట్లు సాధించాయి.
బలేనోలో ఎయిర్ బ్యాగ్స్ లో తేడాలున్నాయి కాని ESC, హిల్ హోల్డ్, ABS + EBD, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ కి ప్రీ-టెన్షనర్స్, ఫోర్స్ లిమిటర్స్ మొదలైన ఫీచర్స్ సమానంగా ఉన్నాయి. అంతేకాకుండా 360 డిగ్రీల కెమెరా, రివర్స్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ హుక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. IRVM, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్, త్రీ పాయింట్ బెల్ట్స్ కూడా బలేనోలో ఉన్నాయి. బలేనో సేఫ్టీ స్టాండర్డ్స్ లో ఇప్పుడు Tata Altroz, Hyundai i20 కార్లతో పోటీ ఇస్తోంది.