155 కి.మీ దూసుకుపోయే బజాజ్ చేతక్ సూపర్ స్కూటర్ ఇదే

Published : Apr 29, 2025, 02:29 PM IST
155 కి.మీ దూసుకుపోయే బజాజ్ చేతక్ సూపర్ స్కూటర్ ఇదే

సారాంశం

Bajaj Chetak 3503: బజాజ్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ఇది తక్కువ ధరకే 155 కి.మీ వరకు పరుగులు పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సూపర్ స్కూటర్ ఫీచర్లు తెలుసుకుందామా? 

బ్రాండ్ న్యూ చేతక్ 35 సిరీస్ విజయవంతంగా లాంచ్ అయిన తర్వాత బజాజ్ సంస్థ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ బైక్ ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.10 లక్షలు మాత్రమే.

దేశంలోని అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో ఈ వాహనం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందులో 35 సిరీస్ బ్యాటరీ ప్యాక్, అప్‌డేట్ చేసిన సర్కిల్, తదితర ఫీచర్లు ఉన్నాయి. 35 సిరీస్ వేరియంట్ల మాదిరిగానే ఇది ప్రాథమిక ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఇందులో 3.5 kWh బ్యాటరీ అమర్చడం వల్ల ఇది ఏకంగా 155 కి.మీల రేంజ్‌ వరకు పరుగులు పెడుతుంది. 

ఈ EVలో అద్భుతమైన 35 లీటర్ల బూట్ ఉంది. ఇది టాప్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే 35 సిరీస్ లోని ఇతర ట్రిమ్‌లతో పోలిస్తే ఎంట్రీ లెవల్ ట్రిమ్ గంటకు 63 కి.మీ వేగాన్ని మాత్రమే అందుకోగలదు. 

టాప్ కాంపోనెంట్‌ల విషయానికొస్తే చేతక్ 3503లో బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన కలర్ LCD ఉంది. ఇది వినియోగదారులకు అన్ని కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. హిల్ హోల్డ్ హెల్ప్, రెండు రైడింగ్ మోడ్‌లు, ఇతర సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

అయితే ధర తగ్గించినందుకు గాను సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు వంటి కొన్ని ఫీచర్‌లను తొలగించారు. దీనికి ఛార్జింగ్ సమయం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 0 - 80 % ఛార్జింగ్ ఎక్కాలంటే 3 గంటల 25 నిమిషాలు పడుతుంది.

చేతక్ 3503 మోడల్ TVS iQube 3.4, Ola S1X+, Ather Rizta S వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. ఇందులో నాలుగు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇండిగో బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, మ్యాట్ గ్రే.

ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. డెలివరీలు మే మొదటి వారం నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అద్భుతమైన ఫీచర్ జాబితా, ఎక్కువ రేంజ్‌తో, రోజువారీ ఉపయోగం కోసం సరసమైన EV స్కూటర్ కోరుకునే వినియోగదారులకు ఈ స్కూటర్ బెస్ట్ సెలెక్షన్ అవుతుంది. 

ఇది కూడా చదవండి బంపర్ ఆఫర్: అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !