ఎలక్ట్రిక్ కార్ కొంటున్నారా, అయితే బ్యాంకులు అందిస్తున్న స్పెషల్ EV లోన్ వడ్డీ రేట్లు ఇవే..

By Krishna AdithyaFirst Published Oct 19, 2022, 10:44 PM IST
Highlights

ఎలక్ట్రిక్ కార్ల ధర సాధారణ పెట్రోల్ డీజిల్ కార్ల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు ఎలక్ట్రిక్ కార్లు కొనేందుకు లోన్స్ ఇస్తున్నాయి. మీరు కూడా ఎలక్ట్రిక్ కార్లను  కొనాలని చూస్తుంటే పలు బ్యాంకులు అందిస్తున్నా లోన్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం. 

దీపావళి అనగానే అందరూ కొత్త వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.  కార్లు కొనుగోలు చేసేవారు దీపావళినే శుభముహూర్తంగా ఎంచుకుంటారు.  అయితే ప్రస్తుతం కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 

ధన్‌తేరస్ నుండి దీపావళి వరకు ఇంట్లో ఏదైనా కొత్తవి తీసుకురావడానికి చాలా శుభప్రదంగా భావిస్తారు. మీరు కూడా  ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఎలక్ట్రిక్ కారు ఉత్తమ ఎంపిక. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలా బ్యాంకులు ఎలక్ట్రిక్ కార్ల కోసం ఆకర్షణీయమైన ధరలకు రుణాలు అందిస్తున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యాక్సిస్ బ్యాంక్  పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు ఈ రోజుల్లో కారు రుణాలపై అనేక రకాల ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ బ్యాంకులు EV కోసం ప్రత్యేక వడ్డీపై రుణాలు ఇస్తున్నాయి.

వాహనాలపై బోలెడన్ని ఆఫర్లు
ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారుల ఎంపికగా మారుతుండగా, ప్రభుత్వం కూడా తన వైపు నుంచి ఈ వాహనాలను ప్రమోట్ చేస్తోంది. ఈ వాహనాలపై కంపెనీలు కొత్త ఆఫర్లను కూడా వినియోగదారులకు అందిస్తున్నాయి.పెరుగుతున్న డీజిల్-పెట్రోల్ ధరల మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు మెరుగైన ఎంపికగా దూసుకు వస్తున్నాయి. జానికి పెట్రోల్  డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ చాలా తక్కువ.

ఎలక్ట్రిక్ వాహనాలపై రుణంపై బంపర్ తగ్గింపు
పెట్రోల్  డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల కోసం రుణ వడ్డీ రేట్లు 10-30 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉన్నాయి. ఇది వేర్వేరు బ్యాంకులకు భిన్నంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు రుణాల కోసం ఫ్లాట్ ఫీజులు వసూలు చేస్తుంటే, కొన్ని బ్యాంకులు పండుగ సీజన్‌లో ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం లేదు.

ఏ బ్యాంకు రేటు ఎంత
>> బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలక్ట్రిక్ కార్ లోన్ పెట్రోల్, డీజిల్ కార్ల కంటే 0.25 శాతం వరకు తక్కువగా అందిస్తోంది.
>> SBI గ్రీన్ కార్స్ లోన్ వడ్డీ రేటు 7.95 నుండి 8.30 శాతంగా ఉంది.  SBI కనీస రుణ కాల వ్యవధి మూడేళ్లు.
>> యాక్సిస్ బ్యాంక్ ఇ-కార్ లోన్ కాలపరిమితి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది.
>> Axis Bank  7.70 శాతం, SBI  7.95 శాతం, Union Bank 8.40 శాతం, PNB 8.55 శాతం, BoB 8.45శాతం, Canara Bank  8.80శాతం మేర వడ్డీరేట్లతో  అందిస్తున్నాయి. 

click me!