SBI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఈ నిబంధన ఏప్రిల్ 1 నుండి కొన్ని క్రెడిట్ కార్డులకు అండ్ ఏప్రిల్ 15 నుండి మరికొన్ని క్రెడిట్ కార్డులకు వర్తిస్తుంది.
మీరు SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్ల ? అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. ఇప్పుడు SBI క్రెడిట్ కార్డ్ నిబంధనలలో అనేక మార్పులు చేసింది. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపులపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వబోమని ఎస్‌బీఐ కస్టమర్లకు తెలిపింది.
SBI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఈ నిబంధన ఏప్రిల్ 1 నుండి కొన్ని క్రెడిట్ కార్డులకు అలాగే ఏప్రిల్ 15 నుండి మరికొన్ని క్రెడిట్ కార్డులకు వర్తిస్తుంది.
ఏప్రిల్ 1 నుండి ఏ SBI కార్డ్ రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు అనేది ముఖ్యం. SBI కార్డ్ ఎలైట్, SBI కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, SBI కార్డ్ పల్స్, SimpleClick SBI కార్డ్, SimpleClick అడ్వాంటేజ్, SBI కార్డ్ ప్రైమ్, SBI కార్డ్ ప్రైమ్ అడ్వాంటేజ్ SBI కార్డ్ ప్లాటినం, SBI కార్డ్ ప్రైమ్ ప్రో, SBI కార్డ్ శౌర్య సెలెక్ట్, SBI కార్డ్ ప్లాటినం అడ్వాంటేజీ, గోల్డ్ SBI కార్డ్, గోల్డ్ క్లాసిక్ SBI కార్డ్, గోల్డ్ డిఫెన్స్ SBI కార్డ్ ఇంకా మరిన్ని ఎంప్లాయీస్ SBI కార్డ్, గోల్డ్ అలాగే ఇతర అడ్వాంటేజ్ SBI కార్డ్, సింప్లీ సేవ్ SBI కార్డ్ పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి.
అంతేకాకుండా, ఏప్రిల్ 15 నుండి కొన్ని SBI కార్డులపై రివార్డ్ పాయింట్లు ఉండవు. ఈ లిస్టులో ఎయిర్ ఇండియా SBI ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ కార్డ్, FBB స్టైల్‌అప్ SBI కార్డ్, సెంట్రల్ SBI కార్డ్, సెంట్రల్ SBI కార్డ్ సెలెక్ట్, నేచర్ బాస్కెట్ SBI కార్డ్, ఆదిత్య బిర్లా SBI కార్డ్ సెలెక్ట్, BPCL SBI కార్డ్ ఆక్టేన్, IRCTC SBI కార్డ్ ప్రీమియర్ వీటిలో విస్తారా SBI కార్డ్ ప్రైమ్, లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్, లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్ సెలెక్ట్, లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్ ప్రైమ్, నేచర్ బాస్కెట్ SBI కార్డ్ ఎలైట్ అండ్ ఫాబిండియా SBI ఉన్నాయి.