డొనాల్డ్ ట్రంప్‌ విజయంపై జ్యోతిష్కుడి జాతకం.. ఇంటర్నెట్ లో ఆనంద్ మహీంద్ర ఫోటోలు వైరల్..

By Sandra Ashok KumarFirst Published Nov 5, 2020, 12:43 PM IST
Highlights

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  డొనాల్డ్ ట్రంప్ విజయంపై జ్యోతిష్కుడి పాపులరిటీ పెరుగుతుందని ఆనంద్ మహీంద్రా స్వయంగా అన్నారు.
 

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూ‌ఎస్ ఎలెక్షన్స్ 2020లో విజయం సాధిస్తారని ఒక భారతదేశ జ్యోతిష్కుడి అంచనా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

ఈ విరల్ పోస్టును భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా జ్యోతిష్కుడి అంచనా వేసిన ఫోటోను ట్విట్టర్‌ ద్వారా  షేర్ చేశారు. అయితే ఆ  జ్యోతిష్కుడి పేరు, వివరాలను వెల్లడించకుండా  ఫోటోని కట్ చేసి పోస్ట్ చేశారు.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  డొనాల్డ్ ట్రంప్ విజయంపై జ్యోతిష్కుడి పాపులరిటీ పెరుగుతుందని ఆనంద్ మహీంద్రా స్వయంగా అన్నారు.

ఈ జ్యోతిష్కుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి కూడా అమెరికా అధ్యక్ష పదవిని కొనసాగిస్తారని ఊహిస్తూ ఒక అంచనా వేసి జాతకాన్ని రాశాడు. ఇది కాస్త ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.

also read 

డొనాల్డ్ ట్రంప్‌ ఫలితాల కంటే ముందుగానే విజయం సాధించినట్లు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో జ్యోతిష్కుడు వేసిన అంచనాని  షేర్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ నిజంగానే యూ‌ఎస్ ఎలెక్షన్స్ 2020 గెలిచి పదవిని కొనసాగిస్తే, ఈ జ్యోతిష్కుడు తేలికగా ఎంతో పాపులర్ అవుతాడు" అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ కామెంట్ కూడా పోస్ట్ లో చేశారు.

ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్ లో 2వేల లైక్స్  వచ్చాయి. ఒక్క ఆనంద్ మహీంద్రా మాత్రమే కాదు చాలా మండి సోషల్ మీడియాలో ఈ ఫోటోలో షేర్ చేయడంతో  ఎంతో వైరల్ అయ్యింది.

డొనాల్డ్ ట్రంప్ బుధవారం తాను అమెరికా ఎన్నికల్లో గెలిచానని, ప్రత్యర్థి జో బిడెన్ డెమొక్రాట్లు  అన్యాయానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపు వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.

పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగాన్, జార్జియాతో సహా కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇంకా స్పష్టంగా లేవు. ప్రధాన నెట్‌వర్క్‌ల నుండి వచ్చిన అంచనాలు, 74 ఏళ్ల ట్రంప్ తిరిగి ఎన్నికలలో గెలవవలసిన 270 ఎన్నికల ఓట్లకు ఇంకా తక్కువ.

అతను ఇప్పటికే ఫ్లోరిడా, ఒహియో, టెక్సాస్ వంటి ముఖ్య రాష్ట్రాలలో చెలిచాడు. జో బిడెన్ అరిజోనా, వర్జీనియా, న్యూ హాంప్షైర్లలో గెలిచాడు.
 

click me!