ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాన్ని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...5 ఏళ్ల నుంచి 95 ఏళ్ల వరకూ పాప జీవన యానం..

Published : Apr 26, 2023, 11:42 AM IST
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాన్ని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా...5 ఏళ్ల నుంచి 95 ఏళ్ల వరకూ పాప జీవన యానం..

సారాంశం

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు సంబంధించిన అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఓ పాప ఐదేళ్ల నుంచి 95 ఏళ్ల వరకు ఆమె ముఖకవళికల్లో కలిగే మార్పులను ఆవిష్కరిస్తూ ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు ఎప్పటికప్పుడు రకరకాల ట్రెండింగ్ వీడియోలను ఆయన తన ఫాలోయర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా తెగ వైరల్ అయిపోయింది. గూగుల్ తన AI టూల్ బార్డ్‌ను కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు, మోడల్స్ వంటి అనేక విషయాలను బార్డ్ ద్వారా డెవలప్ చేయవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో, 5 ఏళ్ల అమ్మాయి 95 ఏళ్లలో ఎలా ఉంటుందో AI సహాయంతో చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే పరిశ్రమలో చాలా మంది ఏఐకి భయపడుతున్నారు. అని తాను ఏమాత్రం భయపడనని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ శక్తి అద్భుతమని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

గూగుల్ బార్డ్ AI సహాయంతో యూజర్లు కోడింగ్, డీబగ్గింగ్ సాఫ్ట్‌వేర్‌లను అభివృద్ధి చేయగలరని Google ఇటీవల బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఫ్రెషర్స్ కూడా దీని సహాయంతో కోడింగ్ నేర్చుకోవచ్చు. బార్డ్ జావా, సి++ పైథాన్‌తో సహా 20 AI కోడింగ్ భాషలను వ్రాయగలదు.

మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత యావత్ ప్రపంచాన్ని కలవడానికి గురిచేస్తోంది ఇప్పటికే దీని ద్వారా అనేక మంది ఉద్యోగాలు కోల్పోతారు అనే వాదన బయలుదేరింది.  మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి సంఘవిద్రోహక కార్యకలాపాలు సైతం పాల్పడే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.  ఇ ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ మేయర్ తన గురించి చాట్ జిపిటి  తప్పుడు సమాచారం ఇచ్చిందని కోర్టుకు ఎక్కారు.  అలాగే ఇటలీలో సైతం చాట్ జిపిటిని రద్దు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో చాట్ బాట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 

 

PREV
click me!

Recommended Stories

OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు
Silver Price: ఈ రోజు 5 కిలోల వెండి కొంటే.. 2030 నాటికి మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా.?