
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్టాక్ మార్కెట్ల అస్థిరతను తనదైన శైలిలో పోల్చి చెప్పారు.
స్టాక్ మార్కెట్ (లేదా షేర్ మార్కెట్) అనునది కంపెనీ వాటా (స్టాక్/షేర్)లు కొనుగోలు, అమ్మకాలు జరుపుటకై ఏర్పరచిన ఒక వాణిజ్య సముదాయం. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్‌గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు చాలా తరచుగా స్టాక్ బ్రోకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతాయి. ఈ స్టాక్ మార్కెట్ అనేది ముఖ్యంగా బుల్, బేర్‌ల మీద ఆధారపడి ఉంటుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పడూ భిన్నమైన వీడియోలు, సందేశాలు పెడుతు ఉంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో స్టాక్ మార్కెట్‌ను పోలుస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. అదేంటంటే.. ఆనంద్ మహీంద్రా రోలర్ కోస్టర్ వీడియోను పోస్ట్ చేసి దానిని స్టాక్ మార్కెట్ అస్థిరత (లాభ, నష్టాలు)ను పోల్చారు. రోలర్ కోస్టర్ ఎక్కినవారు ఆడ్రినలిన్-ప్రేరేపిత రైడ్ మిమ్మల్ని ఎంత థ్రిల్‌కు గురిచేస్తుందో ఊహించండి..? స్టాక్ మార్కెట్ కూడా అంతే అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. "మార్కెట్లలో మరో రోజు. మూర్ఛ లేనివారికి కాదు" అని మహీంద్రా ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు.
మహీంద్రా పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియో ఇప్పటివరకు 328k పైగా వీక్షకులు చూశారు. నెటిజన్లు మహీంద్రా మాటలతో పూర్తిగా ఏకీభవించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం గురించి నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. రోలర్ కోస్టర్ రైడ్ కంటే స్టాక్ మార్కెట్ అనుభవం చాలా భయంకరమైందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ గత కొద్దిరోజుల నుంచి లాభ, నష్టాలను చవిచూస్తుంది. దీంతో ఆనంద్ మహీంద్రా స్టాక్ మార్కెట్‌ను ఉద్దేశిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో రోలర్ కోస్టర్ వీడియో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.